కాంచన 3.. అదేం క్రేజ్ రా బాబూ?

కాంచన సిరీస్ వన్, టుల సంగతి అలావుంచితే పార్ట్ త్రీ గురించి ఎందుకో విడుదలకు ముందు నుంచి కాస్త నెగిటివ్ టాక్ వినిపించడం ప్రారంభమైంది. సమ్మర్ హాలీడేస్, ఫ్యామిలీ సినిమాలదే హవా, ఇలాంటి టైమ్…

కాంచన సిరీస్ వన్, టుల సంగతి అలావుంచితే పార్ట్ త్రీ గురించి ఎందుకో విడుదలకు ముందు నుంచి కాస్త నెగిటివ్ టాక్ వినిపించడం ప్రారంభమైంది. సమ్మర్ హాలీడేస్, ఫ్యామిలీ సినిమాలదే హవా, ఇలాంటి టైమ్ లో జెర్సీ ముందు కాంచన-3 వుంటుందా? ఎగురుతుందా? అన్న అనుమానాలు వినిపించాయి. 

ఈ అనుమానాలు ఎలా వున్నా, సినిమా మార్కెటింగ్ మాత్రం బాగా అయింది. నాని నటించిన జెర్సీ రేటుతో సమానంగా, కాస్త అటుగానే తెలుగునాట మార్కెట్ చేసారు. ఏమిటీ ధీమా అనుకున్నారు చాలామంది. సరే, సినిమా విడుదలయింది. క్రిటిక్స్ పెదవి విరిచారు. అబ్బే అన్నారు. కానీ మొదటిరోజు కుమ్మేసింది. రెండోరోజు డ్రాప్ వుంటుందనుకున్నారు. అలా కాలేదు. మూడోరోజు అదేజోరు. నాలుగు, అయిదు ఇలా రోజుల గడుస్తున్నాయి. కాంచన 3 అలా స్టడీగానే వెళ్తోంది.

చిత్రమేమిటంటే, బుర్రపెట్టి, కష్టపడి, కోట్లకు కోట్లు ఖర్చుచేసి, తీసిన జెర్సీకి భయంకరమైన అప్లాజ్ వచ్చింది. కానీ సీడెడ్ లో కాంచన 3ని అథిగమించలేకపోయింది. మండే తరువాత చాలా ఏరియాల్లో కాంచన-3దే హవాగా నిలిచింది. చాలా ఏరియాల్లో ఇప్పటివరకు కంటిన్యూ ఫుల్స్ వచ్చిన పరిస్థితి. చాలా ఏరియాల్లో జెర్సీ కన్నా ఎక్కువ వసూలు చేస్తున్న వైనం.

ఇప్పుడు డైరక్టర్లు బుర్ర పట్టుకోవాల్సిందే. ప్రేక్షకుడు అల్టిమేట్ గా వినోదం తప్ప మరేం చూడడంలేదు. అది ఎఫ్ 2 అయినా, కాంచన-3 అయినా. కాస్త గట్టిగా నవ్వించగలిగితే చాలు. కాసులు కురిపించేస్తారు. అవెంజర్స్ వచ్చి కాంచన-3కి బ్రేక్ వేస్తుందన్న భయంలేదు.

ఎందుకంటే కాంచన 3కి ఇంకా సి సెంటర్లలో చోటు మిగిలేవుంది. అక్కడకు అవెంజర్స్ రావడం కష్టం. అర్బన్ ఏరియాల్లో మాత్రం కాస్త మార్పు వుంటుందేమో చూడాలి. అవెంజర్స్ ను కూడా తట్టుకుంటే కాంచన-3 తరువాత లారెన్స్ కచ్చితంగా మరిన్ని పార్ట్ లు తీసి తీరతాడు.. సందేహం లేదు.

కాంచన 3 సక్సెస్ మీట్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి 

కాంచన నుంచి పాఠాలు లారెన్స్ నేర్చుకున్నాడా?