కృష్ణవంశీ మల్టీస్టారర్ ఇంకా పట్టాలెక్కలేదు. ఈ సినిమా మరింత లేట్ అయ్యే అవకాశాలున్నాయి. దానికి కారణం… వెంకటేష్ అని తెలిసింది. ఈ సినిమాలో వెంకీ ఇంకా డౌటేనట. ఓకే అని కాసేపు… చూద్దాం అని మరికాసేపు చెప్పి చిత్ర బృందాన్ని కన్‌ఫ్యూజ్ చేసేస్తున్నాడు వెంకీ. ఈ పాత్రకు వెంకీ అయితేనే బాగుంటుంది అని నిర్మాత బండ్ల గణేష్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు.
మసాలా ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకోని వెంకీ – ఇక నుంచి మల్టీస్టారర్ కథలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నాడట. అందుకే ఈ సినిమాని లైట్ తీసుకొంటున్నాడని తెలిసింది. వెంకీ ఒప్పుకోకపోతే.. ఆ స్థానంలో ఎవరిని తీసుకోవాలో కూడా కృష్ణవంశీకి అర్థం కావడం లేదు.
వెంకీ కాదంటే ఈసినిమా ఆగిపోయే అవకాశాలే ఎక్కువున్నాయి. దాంతో రామ్‌చరణ్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. తెలుగు చిత్రసీమలో మరో మల్టీస్టారర్ రావాలంటే వెంకీ ఓకే చెప్పాల్సిందే. మరి వెంకీ ఏమంటాడో..?