చెర్రీకి హ్యాండిచ్చిన వెంకీ?

రామ్‌ చరణ్‌, కృష్ణవంశీ సినిమాలో వెంకటేష్‌ నటించడం లేదని టాక్‌ వినిపిస్తోంది. చరణ్‌, వెంకటేష్‌తో ఈ మల్టీస్టారర్‌ రూపొందుతుందని నిర్మాత బండ్ల గణేష్‌ ప్రకటించాడు. వెంకటేష్‌ కూడా తన తదుపరి చిత్రం చరణ్‌తోనే అని…

రామ్‌ చరణ్‌, కృష్ణవంశీ సినిమాలో వెంకటేష్‌ నటించడం లేదని టాక్‌ వినిపిస్తోంది. చరణ్‌, వెంకటేష్‌తో ఈ మల్టీస్టారర్‌ రూపొందుతుందని నిర్మాత బండ్ల గణేష్‌ ప్రకటించాడు. వెంకటేష్‌ కూడా తన తదుపరి చిత్రం చరణ్‌తోనే అని పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. కానీ ఫైనల్‌గా స్టోరీ విన్న తర్వాత వెంకటేష్‌ తన క్యారెక్టర్‌తో శాటిస్‌ఫై కాలేదని, అందుకే ఈ చిత్రంలో నటించనని చెప్పారని తెలిసింది. 

ఇంకా బండ్ల గణేష్‌ ఈ వదంతులపై స్పందించలేదు. కథ సిద్ధం కావడంతో తనకి ఇష్టమైన అంతర్వేదికి కృష్ణవంశీతో పాటు వెళ్లి కథకి పూజ చేయించాడు. ఈ చిత్రంలో నటించే హీరోయిన్లు ఎవరనేదే ఇంకా ఖరారు కాలేదు. ఈలోగా ఓకే అయిన హీరో కూడా తప్పుకున్నారని రూమర్స్‌ వినిపిస్తున్నాయి. ఇందులో వెంకటేష్‌ స్థానంలో శ్రీకాంత్‌ నటించవచ్చునని కూడా వినిపిస్తోంది. 

శ్రీకాంత్‌ ఇంతకుముందే చాలా మంది హీరోలతో కలిసి నటించాడు కాబట్టి ఇక చరణ్‌, శ్రీకాంత్‌ కాంబినేషన్‌కి క్రేజ్‌ వచ్చే అవకాశం లేదు. వెంకటేష్‌ నటిస్తేనే ఈ ప్రాజెక్ట్‌కి అంతో ఇంతో కళ ఉంటుంది. లేదంటే అభిమానులు కూడా లైట్‌ తీసుకునే ప్రమాదముంది. బండ్ల గణేష్‌ ఏదో ఒకటి చేసి వెంకటేష్‌ని లాక్‌ చేస్తాడో లేదో మరి.