కన్నడ హీరోతో చెట్టపట్టాల్?

ఆ నార్త్ హీరోయిన్ తెలుగులో సూపర్ హిట్. పెద్ద హీరోలందరినీ ఒకటికి రెండు రౌండ్లు వేసి మీడియం హీరోల పక్కకు వచ్చింది. ఇక స్పెషల్ సాంగ్ అంటే గభాల్న గుర్తుకు వచ్చేది ఆ హీరోయిన్…

ఆ నార్త్ హీరోయిన్ తెలుగులో సూపర్ హిట్. పెద్ద హీరోలందరినీ ఒకటికి రెండు రౌండ్లు వేసి మీడియం హీరోల పక్కకు వచ్చింది. ఇక స్పెషల్ సాంగ్ అంటే గభాల్న గుర్తుకు వచ్చేది ఆ హీరోయిన్ నే. లక్షల్లో రెమ్యూనిరేషన్ ఇస్తే చాలు స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ లు విరగదీస్తుందా హీరోయిన్.

ఇప్పుడు ఈ హీరోయిన్ ఓ కన్నడ హీరోతో మాంచి దోస్తానా మెయింటెయిన్ చేస్తోందని తెగ గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. రాజకీయమూలాలు వున్న ఓ కన్నడ బడ్డీ హీరోతో ఇప్పుడు ఈ హీరోయిన్ చాలా సన్నిహిత సంబంధాలు కలిగి వుందని తెలుస్తోంది. వాస్తవానికి ఇది పెళ్లి దాకా వెళ్తుందని కన్నడనాట వినిపించినా, ఆ హీరో రాజకీయ మూలాల రీత్యా, అలా జరగలేదని వినికిడి.

పెళ్లి సంగతి ఎలావున్నా, సదరు హీరో, హీరోయిన్ల సన్నిహిత సంబంధ బాంధవ్వాలు మాత్రం బాగానే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలు అయిపోతున్నాయి. మరి ఏదో విధంగా సెటిల్ కావాలి కదా?