Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కన్నారా..విన్నారా..ఈ అగ్రిమెంట్ ను?

కన్నారా..విన్నారా..ఈ అగ్రిమెంట్ ను?

పెళ్లి అంటే ఓ నమ్మకం. ఇద్దరు వేరు వేరు వ్యక్తులు ఒకరి మీద మరొకరు నమ్మకం పెట్టుకుని కలిసి జీవనం సాగించాలని నిర్ణయించుకునేది. అలాంటిది పెళ్లికి ముందే, భవిష్యత్ లో విడిపోతే  ఇలా విడిపోవాలి అని డిసైడ్ చేసుకుని అగ్రిమెంట్ రాసి పెట్టుకుంటే..? చిత్రంగా వుంది కదా? ఇలాంటి వ్యవహారం బాలీవుడ్ లో వుందని వార్తలు వినిపిస్తుంటాయి.

టాలీవుడ్ లో కూడా ఇలాంటి అగ్రిమెంట్ ఓ జంట మధ్య వుందని తెలుస్తోంది.  ఈ జంటలోని యువ హీరోకి తాతలు, తండ్రుల నుంచి వేయి కోట్లకు పైగానే ఆస్తి సంక్రమించిందని తెలుస్తోంది. ఇదే జంటలోని హీరోయిన్ కు తిప్పి తిప్పి లెక్క పెట్టినా వంద కోట్లు వుండదు. ఇలాంటి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.

ఆ చేసుకునే ముందు ఓ అగ్రిమెంట్ చేసుకున్నారని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని టాప్ లాయర్ నే ఆ అగ్రిమెంట్ ను రెడీ చేసినట్లు బోగట్టా. దాని ప్రకారం పెళ్లయిన తరువాత భవిష్యత్ లో విడిపోవాల్సి వస్తే, ఎవరు ఆస్తిని ఎవ్వరూ అడగరాదు. కోర్టులకు ఎక్కరాదు. కేసులు వేయరాదు. ఈ అగ్రిమెంట్ వెనుక మాస్టర్ మైండ్ అంతా హీరో వైపు సన్నిహిత వ్యక్తిదే అని తెలుస్తోంది. 

ఒప్పందం బాగానే వుంది. ముందు చూపు బాగానే వుంది. కానీ ఒకటే అనుమానం. కలకాలం కలిసి వుంటామనే ఆలోచన, నమ్మకంతోనే ఎవరైనా పెళ్లి చేసుకుంటారు. ఇలా ఆస్తుల కోసం వల వేసారేమో అనే అపనమ్మకంతో పెళ్లి ఎందుకు చేసుకోవడమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?