Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కరణం మల్లేశ్వరి బయోపిక్

కరణం మల్లేశ్వరి బయోపిక్

ఎప్పటి నుంచో వార్తల్లో నానుతున్న కరణం మల్లేశ్వరి బయోపిక్ సినిమా ప్రకటన వచ్చేసినట్లే. ఎమ్ వి వి బ్యానర్ పై కోన వెంకట్ కార్పొరేషన్ ఈ సినిమాను నిర్మిస్తారు. గతంలో రాజుగాడు సినిమా డైరక్ట్ చేసిన సంజన రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. 

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస కు చెందిన కరణం మల్లేశ్వరి ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చి  క్రీడా రంగంలో సాధించిన అసమాన విజయాలు ఎలా సాధించింది అన్నది ఈ బయోపిక్ లో చూపిస్తారు. అదే జిల్లా నుంచి వచ్చిన మహిళా దర్శకురాలు సంజన రెడ్డ్ ఈ సినిమాకు మాంచి స్క్రిప్ట్  తయారుచేసి, దర్శకత్వం వహిస్తారు. 

గతంలో ఎమ్ వి వి బ్యానర్ మీద శంకరాభరణం, గీతాంజలి తదితర సినిమాలను ఎమ్ వి వి సత్యనారాయణ నిర్మించారు. ఆయన విశాఖ నుంచి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

పేద‌ల‌కు మంచి జ‌ర‌గ‌డం చంద్ర‌బాబుకు ఇష్టం లేదా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?