అసిస్టెంట్ గా పనిచేసిన వారంతా డైరక్టర్లు కాలేరు. మెగా ఫోన్ పట్టుకున్నవారంతా సీన్లు పండించలేరు. గుణ369 సినిమా టీజర్ చూస్తే ఇదే అనిపిస్తుంది. కొత్త డైరక్టర్ అర్జున్ జంధ్యాల తొలి సినిమా ఇది. అజయ్ భూపతి తొలి సినిమా ఆర్ ఎక్స్ 100 చూస్తే విషయం వుంది డైరక్టర్ దగ్గర అనిపిస్తుంది. గుణ 369 చూస్తే వుందా? అన్న అనుమానం కలుగుతుంది.
టీజర్ అంత అమెచ్యూర్ గా వుంది. టీజర్ లో డైరక్టర్ పేరు మినహా ఎక్కడా కొత్తదనం అన్నది కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. టీజర్ లో తొంగిచూసిన కథ లైన్ లో కూడా అట్టే కొత్తదనం లేదని క్లారిటీ వచ్చేస్తుంది. మంచి హిట్ తరువాత కార్తికేయ చేసిన హిప్పీ మిజరబుల్ ఫెయిల్యూర్. సినిమా సబ్జెక్ట్ నే సమస్య అని అర్థం అయిపోయింది.
మరి ఆ తరువాత వస్తున్న సినిమా కూడా ఇలాగే వుందీ అంటే, కార్తికేయ ఎంచుకుంటున్న తీరుపై అనుమానం కలుగుతుంది. అదే సమయంలో చొక్కా మీద మూడు బొత్తాలు తీసి వదిలేస్తే సరిపోదని, సరైన వెర్సటాలిటీ, నటన ప్రదర్శించాల్సి వుంటుందని కార్తికేయ తెలుసుకోవాలి.
కాంపిటీటీవ్ వరల్డ్ లో నిల్చోవాలంటేనే కష్టపడాలి. ముందుకెళ్లాలి అంటే ఇంకా కష్టపడాలి. కానీ కార్తికేయ కేవలం తన జిమ్ బాడీని నమ్ముకుని ఆగిపోతున్నట్లు కనిపిస్తోంది.