శేఖర్ కమ్ముల-చైతన్య-సాయిపల్లవి

నాగచైతన్య కెరీర్ ఇప్పుడు ఫుల్ స్పీడ్ లో వుంది. వెంకటేష్ తో కలిసి వెంకీమామ చేస్తున్నాడు. అది ఫినిషింగ్ స్టేజ్ లో వుంది. దాని తరువాత బంగార్రాజు సినిమా ను డాడీ నాగ్ తో…

నాగచైతన్య కెరీర్ ఇప్పుడు ఫుల్ స్పీడ్ లో వుంది. వెంకటేష్ తో కలిసి వెంకీమామ చేస్తున్నాడు. అది ఫినిషింగ్ స్టేజ్ లో వుంది. దాని తరువాత బంగార్రాజు సినిమా ను డాడీ నాగ్ తో కలిసి జూలై ఎండ్ లో స్టార్ట్ చేయాలి. యువి బ్యానర్ లో మేర్లపాక గాంధీ సినిమా వుండనే వుంది. దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా ప్లానింగ్ లో వుంది.

ఇలాంటి టైమ్ లో మరో మాంచి సినిమా ఒకటి ఫిక్స్ అయింది. ఫీల్ గుడ్ మూవీ మేకర్ శేఖర్ కమ్ముల డైరక్షన్ లో చైతన్య ఓ సినిమా చేయడానికి అంతా రెడీ అయింది. క్రేజీ కాంబినేషన్ ఈ సినిమా కోసం సెట్ కాబోతోంది. హీరోయిన్ ఎవరో కాదు, శేఖర్ కమ్ముల ఫిదా సినిమాలో నటించి, ప్రేక్షకులను ఫిదా చేసిన సాయిపల్లవి.

చైతన్య-శేఖర్ కమ్ముల-సాయిపల్లవి కాంబినేషన్ అంటే అంచనాలు ఓ రేంజ్ లో వుంటాయి. ప్రస్తుతం శేఖర్ కమ్ముల చేస్తున్న ప్రాజెక్టుకు కాస్త గ్యాప్ వచ్చింది. హీరో, హీరోయిన్లు డ్యాన్స్ ట్రయినింగ్ కు వెళ్తున్నారు. మూడునెలల పాటు గ్యాప్. ఈ గ్యాప్ లో ఈ సినిమా చేసే ప్లానింగ్ ఏదో జరుగుతోంది.

మీడియం హీరోల్లో ఇలాంటి లైనప్ చాలా తక్కువ మందికి వుంది. దాదాపు అన్నీ ప్రామిసింగ్ ప్రాజెక్టులే. నాగచైతన్య కెరీర్ గాడిలోపడినట్లే అనుకోవాలి.

బాబు అప్పుడే ఇలా ఆలోచించి ఉంటే ఫలితముండేదేమో!