అతడేమో తనకు కత్రీనాతో ఎంత స్నేహం ఉందో, రణ్ భీర్ కపూర్ తో కూడా అంతే స్నేహం ఉందని అంటాడు. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న మాటేమిటంటే.. ఆదిత్యరాయ్ కపూర్ ను కత్రినాకైఫ్ బాగా వాడుకుంటోంది అని! ఆమె తన స్వార్థం కోసం ఆమె ఇతడిని వాడుకుంటోందని టాక్ వినిపిస్తోంది.
మరి ఇంతకీ ఈ వాడుకోవడం.. ఎలా? ఏ రకంగా? అంటే.. ఇది వరకూ తన ప్రేమలో సేదతీరి, తనకు దూరం అయిన రణ్ భీర్ ను జలసీకి గురి చేయడానికి ఈ హీరోయిన్ ఆదిత్య రాయ్ ను వాడుకుంటోంది. ‘నువ్వు నన్ను కాదని పోతే ఏంటి..? నీకు సమానమైన అందగాడు, హీరోగా మంచి ఇమేజ్ కలిగిన వాడు.. లవర్ బోయ్.. నాకు దొరికాడు..’ అని రణ్ భీర్ కు సందేశం ఇవ్వడానికి కత్రినా కైఫ్ ఆదిత్యరాయ్ తో సాన్నిహిత్యాన్ని మెయింటెయిన్ చేస్తోందని బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కొంటున్నారు.
ఒక విధంగా రణ్ భీర్ తో ఇగో క్లాషెస్ లో పై చేయి సాధించడానికి ఆదిత్యను కత్రినా వాడుకుంటోందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. రణ్ భీర్ తో బ్రేకప్ తర్వాత కత్రినాకు ఇదో పనైపోయిందని అంటున్నారు. ఆదిత్య మీద జాలి చూపిస్తున్నారు. అయితే ఆదిత్యమాత్రం రణ్ భీర్ ను శత్రువులా చూడటం లేదు, కత్రినాతో తన సాన్నిహిత్యాన్ని దాచుకోని ఈ హీరో రణ్ భీర్ కూడా తనకు స్నేహితుడే అనే స్తున్నాడు.
ఇక రణ్ భీర్ కూడా ఆదిత్యను స్నేహితుడిగానే చూస్తున్నట్టున్నాడు. ఇటీవల తన ఇంటి ఓపెనింగ్ ఫంక్షన్ కు కూడా ఆదిత్యకు ఆహ్వాన పత్రిక పంపించాడు రణ్ భీర్. అయితే.. కత్రినా మాత్రం ఆదిత్యను అటువైపు పోకుండా తన ఇంటికి పిలిపించుకుని మీడియా ముందు హల్ చల్ చేసింది!
మొత్తానికి బ్రేకప్ తర్వాత రణ్ భీర్ తో పోరాటం మొదలుపెట్టి.. దాని కోసం మరో హీరోను అడ్డం పెట్టుకుని.. కత్రినా బాగానే ఆడుకుంటోంది!