వరుణ్ తేజ మరో సినిమా వ్యవహారం కొలిక్కివచ్చినట్లే. శ్రీనువైట్లతో టాగోర్ మధు నిర్మాణంలో మిస్టర్ సినిమా ముస్తాబవుతోంది. ఈ సినిమా జనవరి నెలాఖరుకు దాదాపు పూర్తవుతుంది. శేఖర్ కమ్ముల సినిమా అన్నారు. అది కాస్త అటు ఇటుగా వుంది. అయితే ఈ లోగా నిర్మాత బోగవిల్లి ప్రసాద్ నిర్మాణంలో మరో సినిమా దాదాపు ఫైనల్ అయింది.
కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అవుతారు. ప్రస్తుతం ప్రసాద్ చేతిలో వున్న ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం విడుదలవుతోంది. శర్వానంద్ తో నిర్మిస్తున్న సినిమా మరో పదిహేను రోజుల్లో పూర్తవుతుంది. సో, ఫిబ్రవరిలో వరుణ్ తేజ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం వుంది. ప్రస్తుతం వరుణ్ తేజ మార్కెట్ బాగుంది.
మరో ఇద్దరు నిర్మాతలు కూడా వరుణ్ కోసం ప్రాజెక్టుల సెట్ చేస్తున్నారు. అటు క్లాస్ కు ఇటు మాస్ కు మధ్యగా వుండడం అన్నది వరుణ్ తేజకు కలిసి వస్తున్న అంశం.