మెగాస్టార్ ఆచార్య కథపై రాజేష్ అనే అసోసియేట్ డైరక్టర్ చేసిన ఆరోపణలు టాలీవుడ్ లో ప్రకంపనులు సృష్టిస్తున్నాయి. దాంతో నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఆచార్య నిర్మాణ సంస్థ మాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ ఓ ప్రెస్ నోట్ ను విడుదల చేసింది. తమ సినిమా కథను రహస్యంగా వుంచామని, దానికి మరే కథతో సంబందం లేదని నిర్మాణ సంస్థ ప్రకటించింది.
ఇదిలావుంటే మైత్రీ మూవీస్ సంస్థ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. తాము రాజేష్ కథ విన్నామని, కానీ అది బాగాలేదని, అందుకే వదిలేసామని స్పష్టం చేసారు. కథ బాగుంటే తామే నిర్మించేవారమని, కొత్తవాళ్లని తాము ఎంకరేజ్ చేస్తామని మైత్రీ మూవీస్ స్పష్టం చేసింది.
''…ఆచార్య’పై రాజేష్ అనే వ్యక్తి చేసిన ఆరోపణలు అసత్యమని, మేము అతని కథకు అన్నయ్య అనే పేరు పెట్టాలని కొరటాల శివకు తెలియజేశామని చెప్పడం అబద్దమని, అతని ఆరోపణలు పూర్తిగా ఖండిస్తున్నమని తెలియజేశారు మైత్రిమూవీ మేకర్స్ సంస్థ. గతంలో మేము నూతన దర్శకులలో డియర్‌కామ్రేడ్ (భరత్‌కమ్మ), మత్తువదలరా (రితేష్‌రానా), ప్రస్తుతం ‘ఉప్పెన’ (బుబ్చిబాబు సానా) సినిమాలను నిర్మించాం. రాజేష్ మాకు వినిపించిన కథ బాగుంటే అతనితో కూడా సినిమా నిర్మించేవాళ్లం. కథ బాగాలేకపోవడంతో అతని కథను తిరస్కరించాం. ఇక బాలేని కథతో వేరే వారికి సినిమా నిర్మించాలని ఎందుకు చెబుతాం? కొరటాల శివ గారిపై ఎటువంటి ఆధారాలు లేకుండా అర్థరహితమైన ఆరోపణలు చేయడం సరికాదు.మీడియాలో రాజేష్ చేసిన ఆరోపణలు ఖండించడంతో పాటు ఆయనపై తగిన చర్చలు తీసుకుంటాం. రాజేష్ చేసిన చౌకైన జమ్మికులను అతని ఆరోపణలను అందరూ విస్మరించాలని కోరుకుంటున్నాం…'' అని తెలిపారు