Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహానాయకుడులో కేసిఆర్

మహానాయకుడులో కేసిఆర్

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 2 రాబోతోంది. ఈ సినిమా ఫూర్తిగా ఎన్టీఆర్ పొలిటికల్ లైఫ్ మీద ఫోకస్ పెడుతుంది. ఎన్టీఆర్ భార్య బసవతారకం బతికి వున్నంత వరకు ఎన్టీఆర్ రాజకీయ జీవితం ఏ మలుపులు తిరిగింది అన్నది ఈ భాగంలో వుంటుంది.

ఎన్టీఆర్ చైతన్యయాత్ర, ఆపై ఎన్నికలు, విజయం, అధికారం, నాదెండ్ల వెన్నుపోటు, కేంద్రంపై పోరు, మళ్లీ అధికార స్వీకారం. ఇదీ లైన్ ఆఫ్ ఆర్డర్. ఇందులో కేంద్రంపై పోరులో చంద్రబాబు హీరోచిత పోరాటం కూడా వుంటుంది. అయితే అప్పుడే కేసిఆర్ కూడా పార్టీలో వున్నారు.

పైగా ఆయన ఎన్టీఆర్ వీరాభిమాని. తన కొడుకుకు ఎన్టీఆర్ పేరే పెట్టిన వ్యక్తి. మరి అలాంటి కేసిఆర్ క్యారెక్టర్ మహానాయకుడు సినిమాలో లేకుండా వుంటుందా? విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ఇప్పటివరకు అయితే కేసిఆర్ క్యారెక్టర్ కు ఇంకా ఎవర్నీ తీసుకోలేదు. షూటింగ్ జరగలేదు. ఈనెల 28తో మహానాయకుడు షూట్ పూర్తవుతుంది.

ఈలోగా కేసిఆర్ పాత్రను చిత్రీకరించే అవకాశం వుందని తెలుస్తోంది. రెండు రోజుల చిన్న పాత్ర. అది కూడా పాజిటివ్ గానే కనిపించే పాత్ర మహానాయకుడులో వుండబోతోందని తెలుస్తోంది. కేసిఆర్ పాత్ర వుంటే మహానాయకుడు సినిమాకు తెలంగాణలో మరింత మైలేజీ వుంటుంది అనే భావనతో చివర్లో ఈ విధంగా జోడిస్తున్నారో? లేక చివర్లో చిత్రీకరిద్దామని ఆపారో తెలియదు.

పాత్రధారిని కూడా ఇంకా ఎంపిక చేయకపోవడం అంటే లేటెస్ట్ జోడింపు అనే అనుకోవాల్సి వస్తోంది.

కేసీఆర్, చంద్రబాబు ఫ్రంట్ గెలుపెవరిది? 

ఎన్టీఆర్ బయోపిక్ః ఒకవైపే చూడు..!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?