Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కథే సమస్య కొరటాల సినిమాకు?

కథే సమస్య కొరటాల సినిమాకు?

ఎన్టీఆర్-కొరటాల సినిమా అప్ డేట్ తెలియక ఫ్యాన్స్ కిందా మీదా అయిపోతున్నారు. హీరోయిన్ దొరక్క ఆలస్యం అంటూ కొన్ని వార్తలు వినిపించాయి. మరీ హీరోయిన్ దొరక్క పోవడం ఏమిటీ అదీ ఎన్టీఆర్ కు అంటూ కౌంటర్లు కూడా వినిపించాయి. 

ఇలా రకరకాల కామెంట్లు, ట్విట్టర్ లో అభిమానుల వేడుకోళ్లు అన్నీ వినిపిస్తున్నా యూనిట్ వైపు నుంచి చలనం లేదు. ఇంతకీ అసలు విషయం కథలో సెకండాఫ్ అంటూ లేటెస్ట్ గా గ్యాసిప్ వినిపిస్తోంది.

కొరటాల లైన్ చెప్పారని, తరువాత కొంత పోర్షన్ కథ చెప్పారని తెలుస్తోంది. కానీ సెకండాఫ్ కాస్త నార్మల్ గా వుందని, హై లు, కానీ ఎలివేషన్లు కానీ పెద్దగా లేకపోవడంతో ఎన్టీఆర్ ఆ మేరకు మార్చ మని చెప్పినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. 

కొరటాల కథ తయారు చేసుకోవడం అంటే తపస్సులోకి వెళ్లినట్లే. ఆయన ఒంటరిగా రోజుల తరబడి వుంటూ కథ తయారు చేసుకుంటారు.

ప్రస్తుతం అదే పని మీద వున్నట్లు తెలుస్తోంది. పోనీ కొరటాల శివ సినిమాను పక్కన పెట్టి మరో సినిమా టేకప్ చేసే అవకాశం అయితే లేదు. వెనకాల లైన్ లో బుచ్చిబాబు బౌండ్ స్క్రిప్ట్ తో రెడీగా వున్నా, ఆ సినిమా నిర్మించాల్సిన మైత్రీ మూవీ మేకర్స్ కు కొరటాల కు అద్భుతమైన స్నేహం వుంది. అందువల్ల ఆ లైనప్ అయితే మారదు.

హీరోలు అందరికీ ఇప్పుడు కథలే సమస్య. దర్శకులను, వాళ్ల ట్రీట్ మెంట్ నమ్మేసి బ్లైండ్ గా ముందుకు వెళ్లడం లేదు. ఫుల్ కథ నెరేషన్ తీసుకుని, ఓకె అనుకుంటునే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఎవరి జాగ్రత్త వారిది మరి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?