ఇటీవల కాలంలో షార్ట్ టైమ్ లో ఎక్కువ పాపులారిటీ సంపాదించాడు కత్తి మహేష్. క్రిటిక్ నుంచి వర్తమాన రాజకీయాల కామెంటేటర్ గా మారిన కత్తి మహేష్ గతంలో ఒకటి రెండు సినిమాలు చేసారు. అయితే ఇప్పుడు మరో సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది.
వర్తమాన రాజకీయాలను ఎండగడుతూ, ఓ పోలిటికల్ సెటైర్ సినిమా అందించే ప్రయత్నాన్ని కత్తి మహేష్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి తెలుగులో పొలిటికల్ సెటైర్ సినిమాలు రావడం లేదు. ఎన్టీఆర్ టైమ్ లో చాలా సినిమాలు వచ్చాయి.
నేరుగా ఎన్టీఆర్ పాత్రనే పెట్టి మరీ సినిమాలు తీసారు. అప్పట్లో అవి బాగా పాపులర్ అయ్యాయి కూడా. కృష్ణ, ఏఎన్నార్, కోటా వంటి పేరున్న నటులు ఆ సినిమాలు చేయడం విశేషం.
ఇప్పుడు మారిపోయిన కాలమాన పరిస్థితుల్లో ప్రభుత్వాలకు వ్యతిరకేంగా వెళ్లే ప్రయత్నం హీరోలు కానీ, పెద్దనటులు కానీ చేయడంలేదు. ఇలాంటి టైమ్ లో కత్తి మహేష్ ఓ పోలిటికల్ సెటైర్ సినిమాను అందించాలని పూనుకోవడం అంటే సాహసమే.
పైగా వేరెవరైనా అయితే ఏమోకానీ, ఎంతటి వత్తిడి అయినా తట్టుకుని, ఎలాంటి తిట్లు, దాడులనైనా ఎదుర్కొనే కత్తి మహేష్ లాంటి వ్యక్తి పొలిటికల్ సెటైర్ సినిమా చేయడం అంటే కాస్త సంచలనమే అవుతుంది. ఈ సినిమా త్వరలోనే మొదలై, ఎన్నికల ముందు విడుదలకు రెడీ అవుతుందని వినికిడి.