శౌర్యతో భవ్య సినిమా

ఛలోతో తొలి సూపర్ కమర్షియల్ సక్సెస్ కొట్టాడు హీరో నాగశౌర్య. ఛలోకి ముందుగా ఒకె చేసి, చేసిన రెండు సినిమాలు రెడీగా వున్నాయి విడుదలకు. ఒకటి కణం, మరొకటి అమ్మమ్మగారిల్లు. ఈ సినిమాల తరువాత…

ఛలోతో తొలి సూపర్ కమర్షియల్ సక్సెస్ కొట్టాడు హీరో నాగశౌర్య. ఛలోకి ముందుగా ఒకె చేసి, చేసిన రెండు సినిమాలు రెడీగా వున్నాయి విడుదలకు. ఒకటి కణం, మరొకటి అమ్మమ్మగారిల్లు. ఈ సినిమాల తరువాత చేయాల్సినవి రెండు వున్నాయి. ఒకటి హోమ్ బ్యానర్ లో నర్తనశాల. మరొకటి సాయి శ్రీరామ్ డైరక్షన్ లో ఒకటి.

అయితే హోమ్ బ్యానర్ సినిమా కొద్ది రోజుల్లో స్టార్ట్ అవుతోంది. కిర్రాక్ పార్టీ హీరోయిన్ ను హీరోయిన్ గా, అలాగే సాగర్ మహతిని సంగీత దర్శకుడిగా ఫిక్స్ చేసుకున్నారు. డైరక్టర్ శ్రీనివాస చక్రవర్తి.

ఇదిలా వుంటే ఇప్పుడు మరో సినిమాకు బీజం పడింది. సక్సెస్ ఫుల్ సినిమాలు తీసిన పేద్ద బ్యానర్ భవ్య ఆర్ట్స్ సంస్థ త్వరలో ఓ సినిమాను నాగశౌర్య హీరోగా నిర్మించడానికి రంగం సిద్దం అయింది. ఈ మేరకు అడ్వాన్స్ లు, అగ్రిమెంట్లు జరిగిపోయాయి. అయితే డైరక్టర్, సబ్జెక్ట్ ఫిక్స్ కావాలి.

అంటే విడుదలకు రెడీగా రెండు, నిర్మాణానికి రెడీగా మూడు ప్రాజెక్టులు అన్నమాట.