కత్రినా కైఫ్.. బాలీవుడ్‌లో ఇటీవలి కాలంలో ఈ పేరు మార్మోగిపోతోంది. అందం చూడవయా.. ఆనందించవయా.. అన్నదే ఆమె పాలసీ. గ్లామర్ విషయంలో ఏమాత్రం మొహమాటాల్లేవామెకి. తెలుగులో 'మల్లీశ్వరి', 'అల్లరి పిడుగు' సినిమాల్లో నటించిన కత్రినా, బాలీవుడ్‌లో ఈ స్థాయిలో సక్సెస్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. తొలి సినిమా 'బూమ్'తోనే గ్లామర్‌లో తనకు సాటి ఇంకెవరూ లేరని నిరూపించేసింది.
'మై నేమ్ ఈజ్ లైలా..' అంటూ డాన్సులతోనూ అదరగొట్టేసిన కత్రినాకైఫ్, సినిమాలు చూసే కుర్రకారు గుండెల్లో కోత పెట్టడం మాటెలా వున్నా, చాలామంది బాలీవుడ్ హీరోలకీ గుండె కోతనే మిగుల్చుతోంది. తొలి బాధితుడు మాత్రం ఖచ్చితంగా సల్మాన్‌ఖానే. ఆ తర్వాత రణ్‌బీర్‌కపూర్, మరికొందరు హీరోలతో బీభత్సమైన ఎఫైర్లు నడిపేసి, ఇప్పుడు ఏకంగా అంబానీ తనయుడ్నే లైన్‌లో పెట్టేసిందట.
కత్రినా వాలకం చూస్తోంటే, ఆమె దెబ్బకి ఇంకెంతమంది 'గుండె కోత' అనుభవించాల్సి వస్తుందోనని బాలీవుడ్ సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. తాజా గాసిప్స్‌పై స్పందించిన కత్రినా, 'నాన్సెన్స్.. నా లైఫ్ నా ఇష్టం.. నా మీద అంత విషం చిమ్ముతారా.? స్నేహం వేరు, ప్రేమ వేరు.. ప్రతిదానికీ ఎఫైర్ అంటే ఎలా.?' అంటూ గుస్సా అయ్యింది. ప్రేమ పేరుతో దెబ్బతిన్నది తానేనని చెబుతున్న కత్రినా, తనను దెబ్బకొట్టినవారెవరో అందరికీ తెలుసని సమాధానమిచ్చింది. కత్రినా మాటలెలా వున్నా, ఆమె కారణంగానే చాలామంది హృదయాలకు 'కత్తి' పోట్లు పడ్డాయని ఆ దెబ్బ రుచిచూసిన హీరోలే చెబుతున్నారు.