బన్నీని త్రివిక్రమ్ వదిలేసినట్లేనా?

బన్నీతో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు అందించాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సన్నాఫ్ సత్యమూర్తి సంగతి ఎలా వున్నా, జులాయి మాత్రం ఇప్పటికీ తరచు టీవీలో పలకరిస్తూనే వుంటుంది. ఆ రెండు సినిమాల…

బన్నీతో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు అందించాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సన్నాఫ్ సత్యమూర్తి సంగతి ఎలా వున్నా, జులాయి మాత్రం ఇప్పటికీ తరచు టీవీలో పలకరిస్తూనే వుంటుంది. ఆ రెండు సినిమాల తరువాత మూడో సినిమా కూడా రావాల్సిందే. అయితే కోరి కోరి పవన్ తనతో సినిమా చేయమని పట్టుపట్టడంతో త్రివిక్రమ్ అక్కడితో ఆగిపోయాడు. 

ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే, మరో రెండేళ్ల వరకు త్రివిక్రమ్ ఇక బన్నీతో సినిమా తీసే అవకాశమే లేనట్లు కనిపిస్తోంది. 2017 మొదటి ఆరునెలలు త్రివిక్రమ్ పవన్ సినిమాతో బిజీగా వుంటాడు. ఆ తరువాతి ఆరు నెలలు ఎన్టీఆర్ సినిమా వుంటుందని అంటున్నారు. అది లేకపోయినా మహేష్ సినిమా వుంటుంది. 2018 ఈ రెండింటిలో వుండిపోయిన దాన్ని ఫినిష్ చేయాల్సి వుంటుంది. అంటే 2018 సగం గడిచిపోతుంది. మళ్లీ ఈ గ్యాప్ ల మధ్యలో కథ కోసం కుస్తీలు, స్క్రిప్ట్ ప్రిపరేషన్ లు అన్నీ కలిపి మరో ఆర్నెలు. అంటే 2018 ఫినిష్. 

సో, ఇప్పటికి వున్న కమిట్ మెంట్లు ఏవీ స్కిప్ చేయకుంటే మరో రెండేళ్ల వరకు బన్నీతో త్రివిక్రమ్ సినిమా వుండదు. అయినా బన్నీ కూడా వెనక్కు తగ్గేట్లు కనిపించడం లేదు. లింగు స్వామి, విక్రమ్ కుమార్ ల ను లైన్ లో వుంచుకున్నాడు. రెండేళ్లలో మహా అయితే మూడు లేదా నాలుగు సినిమాలు. ఇద్దరు డైరక్టర్లు రెడీ. మరో ఇద్దరు కావాలి. సుకుమార్, కొరటాల శివలతో టచ్ లో వున్నాడని వినిపిస్తోంది. అందువల్ల ఇక త్రివిక్రమ్ తో బన్నీ సినిమాను ఇప్పట్లో మరిచిపోవచ్చు.