కత్తిరిస్తే బాగుందా?

ఆటోనగర్‌ సూర్య చడీచప్పుడు రాకుండా రావడంతో తొలి రెండు రోజులు ఇది వచ్చిన సంగతి కూడా ఆమ్‌ ఆద్మీకి తెలిసినట్టు లేదు. ఆదివారం మాత్రం ఈ చిత్రానికి అన్ని చోట్ల వసూళ్లు బాగానే వచ్చాయి.…

ఆటోనగర్‌ సూర్య చడీచప్పుడు రాకుండా రావడంతో తొలి రెండు రోజులు ఇది వచ్చిన సంగతి కూడా ఆమ్‌ ఆద్మీకి తెలిసినట్టు లేదు. ఆదివారం మాత్రం ఈ చిత్రానికి అన్ని చోట్ల వసూళ్లు బాగానే వచ్చాయి. అయితే ఇది ట్రిమ్మింగ్‌ ఎఫెక్ట్‌ ఏమో అనుకుంటున్నారు ఆటోనగర్‌ సూర్య మేకర్స్‌. 

సెకండాఫ్‌లో ఉన్న నాన్సెన్స్‌ మొత్తాన్ని ట్రిమ్‌ చేసేసి, ఇప్పుడు కత్తిరించిన వెర్షన్‌నే ప్రదర్శిస్తున్నారు. ఓవర్సీస్‌లో మాత్రం ఆ సౌకర్యం లేదట. కత్తిరించిన తర్వాత ఈ చిత్రం ముందు కంటే మెరుగ్గా ఉందని ఫీడ్‌బ్యాక్‌ వస్తున్నట్టు దేవా కట్టా చెబుతున్నాడు. 

అయితే ఆదివారం నాడు కొత్తగా రిలీజ్‌ అయిన ఆటోనగర్‌ సూర్య వసూళ్లే కాదు… అయిదు వారాల క్రితం వచ్చిన మనం కూడా మంచి కలెక్షన్స్‌ రాబట్టుకుంది. కాబట్టి సూర్య అసలు సిసలైన పరీక్ష సొమ, మంగళవారాల్లో జరుగుతుంది. ఈ రెండు రోజుల్లో స్టెడీగా ఉన్నట్టు అయితే యావరేజ్‌ రిజల్ట్‌తో అయినా గట్టెక్కే అవకాశముంటుంది.