కత్రినాకైఫ్.. కొత్త లవర్ అతడేనా!

విక్కీ కౌశల్.. బాలీవుడ్ కు ఇప్పుడు మోస్ట్ వాంటెడ్. 'సంజూ' సినిమాలో తన నటనతో తన ప్రత్యేకతను నిరూపించుకున్న విక్కీ ఆ తర్వాత బాలీవుడ్ లో ఇబ్బడిముబ్బడిగా అవకాశాలు పొందుతూ ఉన్నాడు.  అలాగే అమ్మాయిలో…

విక్కీ కౌశల్.. బాలీవుడ్ కు ఇప్పుడు మోస్ట్ వాంటెడ్. 'సంజూ' సినిమాలో తన నటనతో తన ప్రత్యేకతను నిరూపించుకున్న విక్కీ ఆ తర్వాత బాలీవుడ్ లో ఇబ్బడిముబ్బడిగా అవకాశాలు పొందుతూ ఉన్నాడు.  అలాగే అమ్మాయిలో ఇతడికి ప్రత్యేక ఫాలోయింగ్ మొదలైంది. 'లస్ట్ స్టోరీస్' లో విక్కీ చేసిన పాత్ర కూడా ఇతడి క్రేజ్ ను అమ్మాయిల్లో ఏ మాత్రం తగ్గించలేకపోయినట్టుంది!

ఆ సంగతలా ఉంటే.. విక్కీ పేరు ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జతలో వినిపిస్తూ ఉంది. కత్రినాకైఫ్ కొత్త లవర్ విక్కీనే అనే ప్రచారం సాగుతూ ఉంది. దీవాళీ సెలబ్రేషన్స్ లో వీళ్లిద్దరూ కలిసి కనిపించడం ఆ రూమర్లకు మరింత ప్రచారాన్ని కల్పిస్తూ ఉంది. ఒక కామన్ ఫ్రెండ్ ఇంట్లో వీళ్లిద్దరూ కలిసి దీవాళీ జరుపుకున్న ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి.

ఇదివరకూ కత్రినాకు బాలీవుడ్ ప్రముఖ హీరోలతోనే ప్రేయాణాలు నడిపిన నేపథ్యం ఉంది. సల్మాన్ ఖాన్, రణ్ బీర్ కపూర్ వంటి వాళ్లు కత్రినాతో కలిసి కనిపించిన వాళ్లే. ఇప్పుడు ఆ స్థానం విక్కీ కౌశల్ కు దక్కిందనే ప్రచారం సాగుతూ ఉండటం గమనార్హం. మరి ఇప్పుడిప్పుడే మొదలైన ఈ వ్యవహారం ఎన్నాళ్లు సాగుతుందో! అని పరిశీలకులు అంటున్నారు.

మునిగిపోయిన టిడిపి ఇప్పట్లో పైకి తేలడం కష్టమే