విడిపోయిన ప్రేమికుడితో మళ్లీ రొమాన్స్

కొన్నాళ్లు ప్రేమించుకోవడం.. కలిసి తిరగడం.. తర్వాత విడిపోవడం.. ఇదంతా వ్యక్తిగతం. కలిసి పనిచేయాల్సి వచ్చినప్పుడు మాత్రం వ్యక్తిగత విభేదాల్ని పక్కనపెట్టాలి. కెమెరా ముందు నవ్వుతూ పోజులివ్వాలి. ఈ విషయం కత్రినాకైఫ్ కు బాగా తెలుసు.…

కొన్నాళ్లు ప్రేమించుకోవడం.. కలిసి తిరగడం.. తర్వాత విడిపోవడం.. ఇదంతా వ్యక్తిగతం. కలిసి పనిచేయాల్సి వచ్చినప్పుడు మాత్రం వ్యక్తిగత విభేదాల్ని పక్కనపెట్టాలి. కెమెరా ముందు నవ్వుతూ పోజులివ్వాలి. ఈ విషయం కత్రినాకైఫ్ కు బాగా తెలుసు. అందుకే విడిపోయిన ప్రేమికుడితో వెండితెరపై రొమాన్స్ కు సై అంది.

రణబీర్ కపూర్-కత్రినాకైఫ్ ఎఫైర్ బాలీవుడ్ లో ఓపెన్ సీక్రెట్. వీళ్ల వ్యవహారం పెళ్లి వరకు వెళ్లిందని కూడా అంతా అనుకున్నారు. కానీ అంతలోనే విడిపోయింది ఈ జంట. దాదాపు ఐదేళ్లు ప్రేమించుకొని ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. వీళ్లిద్దరూ కలిసి నటించిన ఆఖరి సినిమా జగ్గా జాసూస్. ఆ సినిమా రిలీజ్ టైమ్ కు ఈ జంట బ్రేకప్ అయింది. ఆ సినిమా ప్రమోషన్ టైమ్ లో కూడా రణబీర్-కత్రిన మధ్య ఎలాంటి కెమిస్ట్రీ కనిపించలేదు.

ఇక వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయడం అసంభవం అనుకుంటున్న టైమ్ లో ఓ మూవీ ప్రకటన రానే వచ్చింది. రణబీర్-కత్రిన జంటగా ఓ యాక్షన్ సినిమా చేస్తానంటున్నాడు దర్శకుడు కబీర్ ఖాన్. గతంలో కత్రినాతో ఫాంటమ్ సినిమా చేసిన ఈ దర్శకుడు.. రణబీర్ సరసన నటించేందుకు ఆమెను ఒప్పించానని చెబుతున్నాడు. త్వరలోనే ఈ సినిమాపై ఓ ప్రకటన రానుంది.