కత్తి ఇప్పుడే పట్టేది లేదట

ఎన్టీఆర్ – గోపీచంద్ మలినేని కలిసి 'కత్తి' తిప్పేస్తారని వార్తలు భగ్గుమన్నాయి. ఒక దశలో గోపీచంద్ మలినేని కూడా ఈ విషయాన్ని తనకు తెలిసిన వారితో పంచుకున్నారు. కానీ ఇప్పుడు పక్కా వార్త ఏమిటంటే,…

ఎన్టీఆర్ – గోపీచంద్ మలినేని కలిసి 'కత్తి' తిప్పేస్తారని వార్తలు భగ్గుమన్నాయి. ఒక దశలో గోపీచంద్ మలినేని కూడా ఈ విషయాన్ని తనకు తెలిసిన వారితో పంచుకున్నారు. కానీ ఇప్పుడు పక్కా వార్త ఏమిటంటే, ఇప్పట్లో ఈ సినిమా చేయడం లేదట. ఇప్పుడు ఎన్టీఆర్-సుకుమార్ సినిమాతో బిజీగా వున్నాడు. ఇది కాగానే మైత్రీ మూవీస్-కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా చేయడానికే తొంభై తొమ్మిది శాతం అవకాశం వుందట. 

దీని తరువాతి సినిమా కూడా ఫిక్సయిపోయినట్లే. వక్కతం వంశీ డైరక్షన్ చేపడతాడు. నిర్మాణాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ చూసుకుంటుంది. దాదాపు ఇది ఎన్టీఆర్ స్వంత బ్యానర్ కింద లెక్క. ఆ తరువాత అవకాశం వుంటే, అప్పుడు చూస్తారు, ఈ కత్తి తిప్పేసంగతి.