నాని చేతిపై జైబాలయ్య టాటూ

మొత్తానికి 14 రీల్స్ సంస్థ మళ్లీ సినిమా నిర్మాణం చేపట్టింది. పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మిన చందంగా, భారీ సినిమాలు చేసిన సంస్థ ఇప్పుడు చిన్న సినిమా చేస్తోంది. నాని కథానాయకుడు..అందాల రాక్షసి…

మొత్తానికి 14 రీల్స్ సంస్థ మళ్లీ సినిమా నిర్మాణం చేపట్టింది. పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మిన చందంగా, భారీ సినిమాలు చేసిన సంస్థ ఇప్పుడు చిన్న సినిమా చేస్తోంది. నాని కథానాయకుడు..అందాల రాక్షసి అందించిన హను రాఘవపూడి దర్శకుడు. ఈ సినిమా టైటిలే జై బాలయ్య.

ఈ సినిమాలో హీరో నాని బాలయ్య అభిమానిగా కనిపిస్తాడట. అందుకే హీరో చేతి మీద కూడా జై బాలయ్య అని టాటూ వుంటుంది. ఈ సినిమా షూటింగ్ కూడా బాలయ్య నియోజకవర్గ ప్రాంతాల్లో జరుగుతూ వుండడం విశేషం.

జై చిరంజీవ ఎప్పుడో వచ్చింది…ఇప్పుడు జై బాలయ్య అన్నమాట. భలే భలేమగాడివోయ్ తరువాత నాని చేస్తున్న సినిమా ఇది. వైవిధ్య మైన పాయింట్ లేకుండా నాని సినిమా ఓకె అనడు. మరి ఈ జై బాలయ్య లో నానికి నచ్చిందేమిటో?