Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కీర్తి సురేష్ కొత్త సినిమా

కీర్తి సురేష్ కొత్త సినిమా

మహానటి తరువాత కీర్తిసురేష్ తెలుగింటి హీరోయిన్ అయిపోయింది. అంతేకాదు, కాస్త విషయం వున్న పాత్ర దొరికితే ఆమె న్యాయం చేస్తుందన్న నమ్మకం కలిగింది. అంతేకాదు, అనుష్క తరువాత కాస్త నటించగల సత్తా వున్న నటి అని కూడా ప్రూవ్ అయింది. కానీ మహానటి తరువాత ఇప్పటికీ ఏ సినిమా రాలేదు. పందెంకోడి-2 వచ్చిన అది స్ట్రయిట్ సినిమా కాదు.

ఇప్పుడు మళ్లీ మరోసారి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేయబోతోంది కీర్తిసురేష్. కొత్త దర్శకుడు ఒకరు తయారుచేసిన మాంచి హీరోయిన్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ కు కీర్తిసురేష్ ఓకె అనేసారు. మహానటి తరువాత ఆమె చేస్తున్న స్ట్రయిట్ తెలుగు సినిమా ఇదే.

కొత్త దర్శకుడు తయారుచేసిన ఫన్ అండ్ ఫ్యామిలీ సబ్జెక్ట్ ను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. పక్కా ఫ్యామిలీ డ్రామాకు ఎంటర్ టైన్ మెంట్ మిక్స్ చేసిన సబ్జెక్ట్ అంట ఇది.

జగన్‌తో పవన్‌ పొత్తు ఎందుకు కుదరలేదంటే?

టికెట్ దక్కకపోతే డబ్బులు మిగులుతాయ్!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?