కెలకలేదు… కలుపుకునే ప్రయత్నం చేశాడు

మనకెందుకులే అనుకున్నాడా..  లేక వివాదాన్ని మరింత సాగదీయడం ఎందుకని భావించాడా..? లేక ఇప్పటికి జరిగింది చాలులే అనుకున్నాడా..? కారణం ఏదేతైనేం బన్నీ మాత్రం తగ్గాడు. ఈసారి అందర్నీ కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేశాడు. తన…

మనకెందుకులే అనుకున్నాడా..  లేక వివాదాన్ని మరింత సాగదీయడం ఎందుకని భావించాడా..? లేక ఇప్పటికి జరిగింది చాలులే అనుకున్నాడా..? కారణం ఏదేతైనేం బన్నీ మాత్రం తగ్గాడు. ఈసారి అందర్నీ కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేశాడు. తన ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అనకుండా.. మెగా ఫ్యాన్స్ అనే పదానికి మీనింగ్ చెప్పాడు.

“మెగా అభిమానులంటే కేవలం మెగాస్టార్ అభిమానులే కాదు. మెగాస్టార్, పవర్ స్టార్ గారు, రామ్ చరణ్, తేజూ, శిరీష్, వరుణ్, చివరికి నిహారిక.. ఇలా అందరి అభిమానుల్నీ కలిపి మెగాభిమానులు అంటారు. మీలో మీరు ఎవరినైనా ఇష్టపడొచ్చు. కానీ మీరంతా కలిసి మెగా ఫ్యాన్స్. సో.. మెగా ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్” ఇలా సాగింది బన్నీ ప్రసంగం. 

డీజే ఆడియో ఫంక్షన్ లో కూడా పవన్ ప్రస్తావన వచ్చింది. చిరంజీవి గురించి ఎవ్వరూ మాట్లాడలేదు కానీ అంతా పవన్ గురించి మాట్లాడారు. మరీ ముఖ్యంగా “చెప్పను బ్రదర్” అన్న బన్నీని ముందు పెట్టుకొని, పవన్ నాకు దైవ సమానం అనే రేంజ్ లో మాట్లాడాడు దర్శకుడు హరీష్ శంకర్. 

హరీష్ మాట్లాడుతున్నంతసేపు బన్నీ కూడా ఓపిగ్గా ఆ మాటలు విన్నాడు. పవన్ గురించి హరీష్ మాట్లాడిన కొన్ని సందర్భాల్లో చప్పట్లు కూడా కొట్టాడు. తర్వాత తను మాట్లాడుతూ తన ప్రసంగంలో “పవర్ స్టార్ గారు” అని సంభోధించాడు. ఫ్యాన్స్ తో మనందరం ఒకటే అని చెప్పే ప్రయత్నం చేశాడు. సో.. ఈసారి బన్నీ స్పీచ్ తో పవన్ అభిమానులు కచ్చితంగా కూల్ అవుతారు.