కెల్లీ డోర్జీ తెలుగు సినిమాకు నార్త్ విలన్. అదేం ప్రారబ్దమో తొలిసినిమా డాన్ నుంచి చూసుకుంటే ఒక్కసినిమా సరిగ్గా ఆడిన పాపాన పోలేదు. మహేష్ మహా భయంకర ఫ్లాప్ నేనొక్కడనేతో సహా. ఇంకా ఇలాంటివి అతగాడి చార్ట్ లో చాలా వున్నాయి.
Advertisement
డాన్, కింగ్, ద్రోణ, కెడి, గోలీమార్, బద్రీనాథ్,దడ,రెబల్, బాద్ షా ఇలా వుంటుంది జాబితా. ఇప్పుడు ఈ కెల్లీ తొలిసారి ‘బ్రదర్ ఆప్ బొమ్మాళి’లో కామెడీ చేస్తున్నాడు. విలన్ గా ఫ్లాపులు ఇచ్చిన కెల్లీ ఈసారి కామెడీతోనైనా తన లెగ్ పవర్ ను పాజిటివ్ గా మార్చుకుని అల్లరి నరేష్ కు ఓ హిట్ ఇస్తాడని ఆశిద్దాం.