రుద్రమదేవి.. అనగానే రౌద్రంగా కన్పించే ధీర వనిత గుర్తుకొస్తుంది. అలాంటి ‘రుద్రమదేవి’ పాత్రలో అనుష్క కన్పించనుందిప్పుడు. గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘రుద్రమదేవి’పై భారీ అంచనాలే వున్నాయి. ఈ సినిమాని అనుష్క అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ‘అరుంధతి’ సినిమాలోని జేజెమ్మగా అనుష్క ఫర్వాలేదన్పించినా, కావాల్సినంత రౌద్రం అనుష్క ఆ పాత్రలో పండించలేకపోయిందన్న విమర్శలున్నాయి.
అందుకనే.. ‘రుద్రమదేవి’ కోసం అనుష్క నటన పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుందట. పోరాట సన్నివేశాల కోసం ప్రత్యేకంగా తర్ఫీదు కూడా పొందింది అనుష్క. ఇక, అనుష్క అంటేనే గ్లామర్. ఆమె సినిమాలో గ్లామర్ లేకపోతే ఎలా.? అన్న ప్రశ్నకు సమాధానంగా ఓ ఫొటోని మీడియాకి వదిలింది చిత్ర యూనిట్. ఈ ఫొటోలో అనుష్క గ్లామరస్‌గా కన్పిస్తోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.
ఇలాంటి సినిమాల్లో గ్లామర్ హద్దులు దాటకూడదు గనుక… ‘గ్లామర్’కి చాలా లిమిటేషన్స్ వుండే వుంటాయి. రుద్రమదేవి అంటే ‘రాణి’ గనుక.. ఆనాటి సంప్రదాయ దుస్తుల్లో నిండైన విగ్రహం అనుష్క.. అదుర్స్ అన్పించడం ఖాయమే. ఇక, తన కెరీర్‌లోనే ది బెస్ట్ పాత్రల్లో ఒకటిగా ‘రుద్రమదేవి’ నిలిచిపోతుందని అనుష్క చెబుతుండగా, గుణశేఖర్ కూడా తన కెరీర్‌లో ఓ మైలురాయి ‘రుద్రమదేవి’ అవుతుందనే ధీమాతో వున్నాడు.