పవన్‌కళ్యాణ్‌ని నమ్ముకుంటే గోవిందా!

వెంకటేష్‌, పవన్‌కళ్యాణ్‌ కలిసి చేస్తున్న ‘గోపాల గోపాల’ చిత్రానికి కోట్‌ చేస్తున్న రేట్స్‌ చూసి ట్రేడ్‌ సర్కిల్స్‌ గుడ్లు తేలేస్తున్నాయి. హిందీలో లో బడ్జెట్‌లో రూపొందిన ‘ఓ మై గాడ్‌’ చిత్రానికి రీమేక్‌ అయిన…

వెంకటేష్‌, పవన్‌కళ్యాణ్‌ కలిసి చేస్తున్న ‘గోపాల గోపాల’ చిత్రానికి కోట్‌ చేస్తున్న రేట్స్‌ చూసి ట్రేడ్‌ సర్కిల్స్‌ గుడ్లు తేలేస్తున్నాయి. హిందీలో లో బడ్జెట్‌లో రూపొందిన ‘ఓ మై గాడ్‌’ చిత్రానికి రీమేక్‌ అయిన ‘గోపాల గోపాల’ సినిమాని తెలుగులో మాత్రం క్రేజీ మల్టీస్టారర్‌లా మార్కెట్‌ చేస్తున్నారు. కమర్షియల్‌ అంశాలు లేని, ఒక కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమాకి మసాలా సినిమాలకి తీసిపోని విధంగా రేట్లు చెబుతున్నారు. 

వెంకీ, పవన్‌ కాంబినేషన్‌ని చూసి డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపిస్తున్నారు. సీడెడ్‌ లాంటి ఏరియాకి ఈ చిత్రానికి ఏడు కోట్లు చెల్లించారని టాక్‌ ఉంది. పవన్‌కళ్యాణ్‌ని దేవుడిగా ప్రత్యేక పాత్రలో ఎలా రిసీవ్‌ చేసుకుంటారో… హీరోయిన్‌ లేని క్యారెక్టర్‌ ఎంతవరకు మాస్‌ని ఆకట్టుకుంటుందో చెప్పలేని పరిస్థితి. ఆడియన్స్‌ కనెక్ట్‌ అయితే ఓకే కానీ ఇది మరీ వెరైటీగా ఉందని డిజప్పాయింట్‌ అయితే ఈ రేట్ల మీద రికవరీ కష్టమేనన్నది ట్రేడ్‌ టాక్‌. 

నిజానికి ఈ చిత్రాన్ని వెంకటేష్‌, పవన్‌ ప్రాఫిట్‌ షేరింగ్‌ పద్ధతిలో చేస్తున్నారని, సెకండ్‌ అండ్‌ థర్డ్‌ పార్టీల ఇన్‌వాల్వ్‌మెంట్‌ లేకుండా సినిమాని ఓన్‌గా రిలీజ్‌ చేసుకుంటారని అనుకున్నారు. అయితే ఇప్పుడు ‘గోపాల గోపాల’ చిత్రాన్ని సగటు కమర్షియల్‌ సినిమాలకి తగ్గట్టే సేల్‌కి పెట్టారు. అన్ని హంగులున్న మాస్‌ సినిమాలే మిస్‌ ఫైర్‌ అవుతున్న టైమ్‌లో గోపాల గోపాలలాంటి ప్రయోగాత్మక చిత్రానికి ఈ రేంజ్‌ బిజినెస్‌ అంటే పెద్ద రిస్కే. మరి దీనిని వెంకీ, పవన్‌ ఏమాత్రం గట్టెక్కిస్తారో చూడాలి.