త్వరలో రక్తచరిత్ర 3

రామ్ గోపాల్ వర్మ ఒక్కోసారి వున్నట్లుండి సైలెంట్ అయిపోతారు. ఐస్ క్రీమ్ మార్కెట్ లోకి రాకుండానే 2 అన్నారు. చకచకా బండి నడిపి, అడియో ఫంక్షన్ చేసి రెండు నెలలు అయింది. ఇప్పటికి విడుదల…

రామ్ గోపాల్ వర్మ ఒక్కోసారి వున్నట్లుండి సైలెంట్ అయిపోతారు. ఐస్ క్రీమ్ మార్కెట్ లోకి రాకుండానే 2 అన్నారు. చకచకా బండి నడిపి, అడియో ఫంక్షన్ చేసి రెండు నెలలు అయింది. ఇప్పటికి విడుదల జాడ లేదు. ఆఖరికి తెలిసిందేమిటంటే, ఈ నెల 21న థియేటర్లలోకి వస్తోందని. 

పైగా అక్కడితో ఆగిపోలేదు. ఈ గ్యాప్ లో శ్రీదేవి సినిమా కానిచ్చేసారట. అక్కడితో ఆగకుండా రక్తచరిత్ర 3 కి శ్రీకారం చుట్టేసారట. మొదటి రెండుపార్టులకు దీనికి సంబంధం ఏమీ లేదు..జస్ట్ జోనర్ అంతే. తనంటే ఇష్టపడే సినీ సెల్రబిటీలు ఈ సినిమాలో జస్ట్ కామియో రోల్స్ లో కనిపిస్తారట.

అన్నీ బాగానే వున్నాయి. ఇంతకీ శ్రీదేవి సినిమాకు నిర్మాత ఎవరంటా అంటే, కాస్మిక్ పిక్చర్స్ నిర్మాణం అని మాత్రమే వుంటుందట. నిర్మాత తెరవెనుకే వుంటారట. తెరముందు అంతా రామ్ జీ యేనట.

ఇదిలా వుంటే అసలు కొసమెరుపు ఏమిటంటే రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ లేనిది తను ఓ సారి తీసిన సినిమాను రిపేర్లుచేయడం అన్నది ఇదే ప్రధమం అని తెలిసింది. ఐస్ క్రీమ్ 2 కి బాగా రీ షూట్ లు చేయడం, పాటలు జోడించాడట.