కేశవకు అదే పెద్ద ప్లస్ పాయింట్

నిఖిల్ హీరోగా నటించిన కేశవ సినిమాకు అన్నీ కలిసొస్తున్నాయి. ఈ మూవీ ఫస్ట్ లుక్ నుంచి ఈమధ్య రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రయిలర్ వరకు అన్నీ క్లిక్ అయ్యాయి. మరీ ముఖ్యంగా “ఎక్కడికి పోతావ్…

నిఖిల్ హీరోగా నటించిన కేశవ సినిమాకు అన్నీ కలిసొస్తున్నాయి. ఈ మూవీ ఫస్ట్ లుక్ నుంచి ఈమధ్య రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రయిలర్ వరకు అన్నీ క్లిక్ అయ్యాయి. మరీ ముఖ్యంగా “ఎక్కడికి పోతావ్ చిన్నవాడా” లాంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో కేశవపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ అనుకూలతలతో పాటు ఇప్పుడు కేశవకు మరో అడ్వాంటేజ్ కూడా కలిసొచ్చింది. అదే రన్ టైం.

రివెంజ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కేశవ సినిమా నిడివి 2 గంటలు మాత్రమే. ఇలాంటి సినిమాలో అనవసరంగా వచ్చే పాటలు, కామెడీ సీన్లు లాంటివి ప్రేక్షకుడ్ని అసహనానికి గురిచేస్తాయి. సినిమా కంటెంట్ ఫ్లోను కూడా దెబ్బతీస్తాయి. ఫైనల్ రిజల్ట్ తేడా కొట్టే ప్రమాదముంది. అందుకే ఈ విషయంలో దర్శకుడు సుధీర్ వర్మ చాలా కేర్ తీసుకున్నాడు. కేవలం 2 గంటల్లోనే సినిమాను ముగించాడు. సో… ఈ రన్ టైం కేశవకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

కుడివైపు గుండె కలిగి, భావోద్వేగాలకు లోనుకాకుండా ఉండే ఓ వ్యక్తి ప్రత్యర్థులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు..? వాళ్లను హతమారుస్తుంటే పోలీసులు హీరోను పట్టుకోగలిగారా లేదా అనేదే స్టోరీ. ఇలాంటి స్టోరీని ఎంత పకడ్బందీ స్క్రీన్ ప్లేతో చెప్పగలిగితే అంత మంచిది. అందుకే బిగి కోల్పోకుండా ఉండేందుకు 2 గంటల్లోనే సినిమా ముగించారట.