Advertisement


Home > Movies - Movie Gossip
తెలుగు సినిమాల్లో డ్రోన్ లు

ఇటీవల డ్రోన్ లు చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ముఖ్యంగా ఏరియల్ ఫొటోగ్రఫీ కోసం డ్రోన్లను ఎక్కువగా వాడుతున్నారు. అయితే సినిమాల్లో డ్రోన్ లను వాడడం, వాటి ఆధారంగా సీన్లు రాసుకోవడం ఇంతవరకు జరగలేదనే చెప్పాలి. అయితే త్వరలో ఫినిష్ కాబోతున్న నాగాచైతన్య సినిమాలో ఈ సీన్లు వున్నాయట. వారాహి సంస్థ నిర్మిస్తున్న సినిమాలో నాగాచైతన్య ఫుల్ యాక్షన్ రోల్ చేస్తున్నాడు.

తల్లితండ్రులను చంపిన వారిపై రివెంజ్ తీర్చుకునే లైన్. ఈ రివెంజ్ లో తాను చంపాలనుకునే వారిని చంపడానికి హీరో డ్రోన్ ల సాయం తీసుకుంటాడట. దీనికి కారణం మరేమీ లేదు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కు డ్రోన్ లకు ముడి వుందట. వాటి ఆపరేషన్ లో, తయారీలో స్పెషలిస్ట్ అన్నమాట. అందుకే మర్డర్లు కూడా డ్రోన్ ల ఆధారంగా చేస్తాడన్నమాట.

మొత్తం మీద నాగాచైతన్య కాస్త కొత్తగా ట్రయ్ చేస్తున్నట్లుంది.