ఖైదీ నెంబర్ 150 విడుదలకు ఇంకా దాదాపు 10 నుంచి పన్నెండు రోజుల టైమ్ వుంది. ఈ లోగానే చకచకా సెన్సారు చేయించేసారు. ఈ సెన్సారు కాఫీ, ఫుల్ అండ్ ఫైనల్ కాపీ కాదని చిన్న గుసగుస వినిపిస్తోంది. ప్రస్తుతం సినిమా రీరికార్డింగ్ ఫస్ట్ హాప్ జరుగుతోంది సెకండాఫ్ కావాల్సి వుంది. డీటీఎస్, ఇంకా చిన్న చిన్న హంగులు, అక్కడక్కడ సిజి పనులు బకాయి వున్నాయని ఇండస్ట్రీ టాక్. వీటితో సమస్య ఏమీ లేదు. ఒక వారంలో ఇవన్నీ పూర్తయిపోతాయి. కానీ అవన్నీ అయ్యాక సెన్సారు చేయించకుండా ఇప్పుడే చేయించేయడం ఎందుకు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అయితే న్యూ ఇయర్ హడావుడి, ఆ తరువాత నాలుగున విజయవాడలో సభ, ఆ తరువాత ఒక రోజైనా రెస్ట్ ఇలా చూసుకుంటే ఆరేడు తేదీలు వచ్చేస్తున్నాయి. 11న విడుదల అనుకుంటే టైమ్ సరిపోతుంది కానీ, కాస్తయినా టెన్షన్ పడాలి. అందుకే ఇప్పుడే సెన్సారు చేయించేసారని ఒక టాక్.
అర్జెంట్ గా సెన్సారు చేయించేస్తే, పోటీలో వున్న శాతకర్ణి యూనిట్ కు సహజంగానే కాస్త గాభరా వస్తుంది. వాళ్ల సినిమా రెడీ అయిపోయింది, తమది ఇంకా కాలేదన్న చిన్న టెన్షన్ రావడం సహజం. అవతలి పార్టీని ఇలా టెన్షన్ పెట్టడం కూడా విన్నింగ్ స్ట్రాటజీలో ఓ భాగం అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
సెన్సారు టాక్ గా పాటలు, డ్యాన్స్ లు బాగున్నాయి అని వినిపిస్తోంది. అంతే తప్ప ఇంతవరకు పుల్ రిపోర్టు ఎక్కడా గ్యాసిప్ ల రూపంలో కూడా వినిపించకపోవడం విశేషం.