తన బర్త్ డేకు చాలా గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది కియరా అద్వానీ. వరస విజయాలతో, ఇటీవలే బాలీవుడ్ అర్జున్ రెడ్డి సంచలన విజయంతో కియరా ఫుల్ ఖుషీగా ఉంది. ఆ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన పరిచయస్తులందరినీ పిలిచి తన పుట్టిన రోజు పార్టీని గ్రాండ్ ఇచ్చింది కియరా.
ఆ పార్టీకి 'కబీర్ సింగ్' హీరో షాహిద్ కపూర్ తో సహా అనేక మంది హాజరయ్యారు. రామ్ చరణ్ తేజ కూడా అటెండ్ అయినట్టుగా ఉన్నాడు. అయితే బర్త్ డే పార్టీ అనంతర సన్నివేశాలే మీడియాకు పసందుగా మారాయి. ఈ మేరకు ముంబై మీడియా ఒక విషయాన్ని హైలెట్ చేస్తూ ఉంది.
పార్టీ అనంతరం సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి వెళ్లిందట కియరా. వారిద్దరూ ఒకే కార్లో వెళ్లారని, పార్టీ ముగించుకున్నాకా అక్కడకు వచ్చిన సెలబ్రిటీలు ఎవరి దారిన వారు పోగా, సిద్ధార్థ్ మల్హోత్రా మాత్రం కియరాను తనతో తీసుకెళ్లాడంటూ రసవత్తరంగా కథనాలను ఇస్తున్నాయి బాలీవుడ్ మీడియా వర్గాలు.
వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని గత కొన్నాళ్లుగా ఊహాగానాలున్నాయి. అయితే వాటిని వీరే ఖండిస్తూ ఉన్నారు. తాము మంచి ఫ్రెండ్స్ అని చెబుతూ ఉన్నారు.