సుజీత్ చెప్పిన సాహో సంగతులు

సాహో సినిమా గురించి వీళ్లు వాళ్లు చెప్పేది వినడమే తప్ప.. డైరక్ట్ గా డైరక్టర్ మీడియా ముందుకొచ్చి మాట్లాడింది లేదు. సినిమాకు సంబంధించి అభిప్రాయాలు పంచుకున్న సందర్భాలు కూడా లేవు. ఎట్టకేలకు ఆ టైమ్…

సాహో సినిమా గురించి వీళ్లు వాళ్లు చెప్పేది వినడమే తప్ప.. డైరక్ట్ గా డైరక్టర్ మీడియా ముందుకొచ్చి మాట్లాడింది లేదు. సినిమాకు సంబంధించి అభిప్రాయాలు పంచుకున్న సందర్భాలు కూడా లేవు. ఎట్టకేలకు ఆ టైమ్ రానే వచ్చింది. సాహో డైరక్టర్ సుజీత్ సడెన్ గా మీడియా ముందుకొచ్చాడు. సినిమా గురించి కొన్ని విశేషాలు పంచుకున్నాడు. మరీ ముఖ్యంగా మ్యూజిక్ డైరక్టర్ల వివాదంపై రియాక్ట్ అయ్యాడు.

“ఒకే సినిమాకు పలువురు సంగీత దర్శకులు పనిచేయడం నేను కొత్తగా స్టార్ట్ చేసింది కాదు. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఈ పద్ధతి ఉంది. ఒకే మ్యూజిక్ డైరక్టర్ ఉంటే సినిమాలో ఫీల్ క్యారీ అవుతుందనేది నేను నమ్మను. ఎందుకంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక్కో సీన్ కు ఒక్కొక్కరు చేస్తే భయపడాలి. అలా  చేస్తే ఫీల్ మారిపోతుంది. సాంగ్స్ విషయంలో ఆ బాధ లేదు. నిజానికి ఇలా డిఫరెంట్ మ్యూజిక్ డైరక్టర్లతో వెళ్లాలని అనుకోలేదు. అదలా జరిగిపోయిందంతే. ఒక్కో పాటను ఒక్కో సంగీత దర్శకుడు చేయడం వల్ల పని కూడా ఫాస్ట్ గా అవుతుంది కదా.”

ఇలా సంగీత దర్శకుల వివాదాన్ని సైడ్ లైన్ చేయడానికి ప్రయత్నించాడు సుజీత్. ఈ సినిమా నుంచి శంకర్-ఎహశాన్-లాయ్ ను ఎందుకు తప్పించారనే విషయంపై  స్పందించన సుజీత్.. సినిమాలో మొత్తం 4 పాటలుంటాయని, 3 పాటలు కథను ముందుకు నడిపించేలా ఉంటాయని, ఒకటి మాత్రం డ్రీమ్ సాంగ్ అని స్పష్టంచేశాడు. సినిమా లేట్ అవుతుందనే అంశంపై కూడా రియాక్ట్ అయ్యాడు.

“సాహో చాలా లేట్ అవుతోందని చాలామంది అన్నారు. కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే.. సినిమా డిలే అవ్వలేదు. మేం ఎక్కువగా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చేశాం. ఇలా చేయడం వల్ల బడ్జెట్ కంట్రోల్ అయింది. పైగా బాహుబలి-2 టైమ్ లో టీజర్ రిలీజ్ చేయడం వల్ల అప్పుడే షూటింగ్ స్టార్ట్ చేశాం అనుకున్నారు. కానీ అప్పుడు షూట్ చేయలేదు. 3 రోజల షూటింగ్ కోసం 3 నెలల ప్రీ-ప్రొడక్షన్ చేశామంటే అర్థం చేసుకోవచ్చు.”

యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన సాహోలో లవ్ స్టోరీ కూడా చాలా కీలకమంటున్నాడు సుజీత్. ఓ దశలో సినిమాను మలుపుతిప్పేది ఈ ప్రేమకథే అంటున్నాడు. బాహుబలి ఒత్తిడి తనపై లేదని, ఆ సినిమా హిట్ అయిందని సాహోలో ఎలాంటి మార్పులు చేయలేదంటున్నాడు. కాకపోతే యాక్షన్ సీక్వెన్స్ లు మాత్రం కొంచెం మార్చానని, కథ, స్క్రీన్ ప్లే మాత్రం బాహుబలికి ముందే అనుకున్నట్టుగానే ఉంటాయని స్పష్టంచేశాడు.