రవితేజ కెరీర్ లో కిక్ సినిమా ఓ మలుపు. అలాగే బలుపు సినిమా ఓ రకం. ఇప్పుడు ఆ రెండు సినిమాలను మిక్స్ చేసి పోస్టర్ కొడితే ఎలా వుంటుందో అలాంటి పోస్టర్ ను సంక్రాంతి సందర్భంగా వదిలారు. టాగోర్ మధు నిర్మిస్తున్న రవితేజ సినిమాకు క్రాక్ అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. సమ్మర్ టార్గెట్ గా ఈ సినిమా తయారవుతోంది.
కిక్ లో ఓపెనింగ్ సీన్ లో మాదిరిగా డ్రెస్ చేసుకున్న రవితేజ, బలుపులో మాదిరిగా తయారైన శృతి హాసన్ కలిసి బైక్ మీద కూర్చున్న పోస్టర్. ఈ పోస్టర్ చమక్కు ఏమిటంటే శృతిహాసన్ బైక్ నడపడం, బైక్ ఫ్యూయల్ టాంక్ మీద బుడ్డోడు అచ్చం రవితేజ గెటప్ లో కూర్చోవడం.
గతంలో విక్రమార్కుడు సినిమాలో చేసిన మాదిరి టఫ్ పోలీస్ క్యారెక్టర్ ను డిజైన్ చేస్తూనే కిక్ టైప్ క్యారెక్టర్ ఎలిమెంట్స్ జోడించి, ఓ కమర్షియల్ ఫార్మాలాను డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే రవితేజ స్టయిల్ ఇలాగే వుంటుంది ఏ సినిమాలో అయినా, కావాల్సింది సరైన కథ, కథనం. అవి వుంటే క్రాక్ అయినా జనరంజకంగా వుంటుంది.