కొత్త దర్శకుడు ఉపేంద్ర డైరక్షన్ లో భరత్ చౌదరి నిర్మిస్తున్న సినిమా ఎమ్మెల్యే (మంచి లక్షణాలున్న అబ్బాయి). ఈ సినిమా విడుదల డేట్ కూడా ఫిక్సయింది. ఆరంభంలో ఈ సినిమా మార్చి 29 అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే కిరాక్ పార్టీ వారం ముందుకు జరిగి మార్చి 16కు వెళ్లిందో, ఎమ్మెల్యే వారం ముందుకు వచ్చి, మార్చి 23కు ఫిక్సయింది.
శ్రీనువైట్ల శిష్యుడు ఉపేంద్ర చేస్తున్న తొలి సినిమా ఇది. పూర్తి ఎంటర్ టైన్ మెంట్ జోనర్ సినిమా ఇది. శాటిలైట్, డిజిటల్, థియేటర్ రైట్స్ అన్నీకలిపి 20 కోట్ల బిజినెస్ చేసింది. కళ్యాణ్ రామ్ సినిమా 20 కోట్ల బిజినెస్ అంటే చెప్పుకోదగ్గ విషయమే. ఆంధ్ర ఆరుకోట్ల రేషియోలో, సీడెడ్ రెండున్నర కోట్లకు ఇచ్చారు. ఓవర్ సీస్ 80లక్షలకు పైగా అమ్మారు. గుంటూరు, కృష్ణా సుధాశ్రీ సుధాకర్ తీసుకున్నారు. శాటిలైడ్, డిజిటల్ అన్నికలిపి ఆరుకోట్లకు పైగా వచ్చాయి.
అందుకే సినిమాను వీలయినంత సేఫ్ గా, జాగ్రత్తగా అందించాలని చూస్తున్నారు. పాటలను ఇప్పటి వరకు టాలీవుడ్ టచ్ చేయని విదేశీ లొకేషన్లలో తీయాలని ఈ నెలాఖరులో బయల్దేరుతున్నారు. మార్చి ఫస్ట్ వీక్ కు ఫస్ట్ కాపీ రెడీ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.