కిర్రాక్ పార్టీ వాయిదా

తొమ్మిదో తేదీ పోటీలోంచి మరో సినిమా వైదొలగింది. ఆ రోజు నాలుగు సినిమాలు షెడ్యూలు అయ్యాయి. మోహన్ బాబు 'గాయత్రి', సాయిధరమ్ తేజ్ 'ఇంటిలిజెంట్', వరుణ్ తేజ 'తొలి ప్రేమ', నిఖిల్ 'కిర్రాక్ పార్టీ'…

తొమ్మిదో తేదీ పోటీలోంచి మరో సినిమా వైదొలగింది. ఆ రోజు నాలుగు సినిమాలు షెడ్యూలు అయ్యాయి. మోహన్ బాబు 'గాయత్రి', సాయిధరమ్ తేజ్ 'ఇంటిలిజెంట్', వరుణ్ తేజ 'తొలి ప్రేమ', నిఖిల్ 'కిర్రాక్ పార్టీ' షెడ్యూలు అయ్యాయి.

కానీ ఇద్దరు మెగా హీరోల సినిమాలు ఓ రోజు అంటే బాగుండదని, తొలి ప్రేమ సినిమాను 10వ తేదీకి అంటే ఒక రోజు వెనక్కు జరిపారు.

ఇప్పుడు మరో సినిమా కిర్రాక్ పార్టీని కూడా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీనికి కారణం పోటీ కాదు. వర్క్ పూర్తి కాకపోవడం. కిర్రాక్ పార్టీ వర్క్ హడావుడిగా చేస్తున్నారని, కొత్త డైరక్టర్ శరణ్ కిందా మీదా అవుతున్నారని ఇటీవలే గ్రేట్ ఆంధ్ర వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు కిర్రాక్ పార్టీకి మరో అదనపు ఆకర్షణ జోడిస్తున్నారు. అదేంటంటే, అర్జున్ రెడ్డి మాదిరిగా రియలిస్టిక్ సౌండ్స్ తో నేపథ్య సంగీతం అందించడం. దాని వల్ల రీ రికార్డింగ్ ఆపేసారు.

అంటే ఈ నేచురల్ సౌండ్స్ జోడించాలి. రీ రికార్డింగ్ జరపాలి. అప్పుడు ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. ఇదంతా 9వ తేదీ లోపు జరిగే వ్యవహారం కాదు. అందుకే వాయిదా పడిపోయినట్లే. అయితే మరి 16న వస్తుందా 23న వస్తుందా అన్నది ఇంకా డిసైడ్ కాలేదు. ఆ రెండు డేట్లలో కూడా కాస్త గట్టిగానే సినిమాలు వున్నాయి. కానీ ఆ డేట్ లు దాటితే ఎగ్జామ్స్ సీజన్ వస్తుంది. సమస్య అవుతుంది. మరి ఏం చేస్తారో చూడాలి.