కీర్తి సురేష్ నా? కీర్తి సురేష్ నా?

మహేష్ బాబు-పరుశురామ్ కాంబినేషన్ 'సర్కారువారి పాట' అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయిపోయిన దగ్గర నుంచి హీరోయిన్ ఎవ్వరు అన్నదే అందరి క్వశ్చను.  ముందుగా కియారా అద్వానీ పేరు బయటకు వచ్చింది. ఆ తరువాత సాయి…

మహేష్ బాబు-పరుశురామ్ కాంబినేషన్ 'సర్కారువారి పాట' అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయిపోయిన దగ్గర నుంచి హీరోయిన్ ఎవ్వరు అన్నదే అందరి క్వశ్చను.  ముందుగా కియారా అద్వానీ పేరు బయటకు వచ్చింది. ఆ తరువాత సాయి మంజ్రేకర్ పేరు వినిపించింది. ఈ రెండు పేర్లు బయటకు వచ్చినపుడు ఫ్యాన్స్ హడావుడి పడలేదు కంగారు పడలేదు కానీ ముచ్చటగా మూడో పేరు కీర్తి సురేష్ పేరు బయటకు రాగానే కాస్త కంగారు పడుతున్నట్లు కనిపిస్తోంది.

ఇది నిజమేనా అంటూ ఫ్యాన్స్ ఎంక్వయిరీలు? ఆమె ఏం సూటవుతుంది? సెట్ అవుతుంది? అంటూ అనుమానాలు. ఫ్యాన్స్ వైపు నుంచి చూస్తే కీర్తి సురేష్ ఎంపిక మీద కాస్త అసంతృప్తిగానే వున్నట్లు కనిపిస్తోంది. ఇదిలా వుంటే సర్కారు వారి పాట నిర్మాతల వైపు నుంచి మాత్రం ఇంకా ఏ హీరోయిన్ అన్నది ఫిక్స్ కాలేదని, ఎప్పటి నుంచి షూట్ అన్నది క్లారిటీగా తెలియకపోతే, ఏ హీరోయిన్ ను అయినా ఎలా ఓకె చేయడం సాధ్యం అన్న పాయింట్ వినిపిస్తోంది.

ఇదిలా వుంటే ఇప్పటికీ పూజా హెగ్డే కు చాన్స్  పోలేదని, ఏ క్షణమైనా మళ్లీ పూజా పేరు గ్యాసిప్ ల్లోకి రావచ్చు అని తెలుస్తోంది. అయితే ఫ్యాన్స్ మాత్రం సాయి మంజ్రేకర్ అయితే బాగుంటుందని, కొత్త ఫేస్, బ్యూటిఫుల్ ఫేస్ అని అనడం విశేషం.

లాక్ డౌన్ ఉండ‌దు…అన్ లాకే

మండలిలో లోకేష్ ఏం చేసాడు