మెగా డాటర్ నీహారిక పెళ్లి ఎప్పటి నుంచో వార్తల్లో వుంటూ వస్తోంది. మిగిలిన పేర్లు అన్నీ ఎలా వున్నా నాగశౌర్య తో పెళ్లి అన్నది గట్టిగా వినిపించింది ఈ ఇంటికి ఆ ఇంటికి రాకపోకలు కూడా పెరిగాయనే వార్తలు వినిపించాయి. సరే అవన్నీ ఏమయ్యాయి అన్నది పక్కన పెడితే 'మిస్ నీహారిక -మిసెస్ నీహారిక' అనే పిక్ తో ఓ హింట్ ఇచ్చి వదిలింది నాగబాబు డాటర్.
ఇలాంటి నేపథ్యంలో తెలుస్తున్న సంగతి ఏమిటంటే, నీహారిక ఎంగేజ్ మెంట్ అయిపోయిందన్నది. కేవలం మెగా ఫ్యామిలీ మెంబర్స్ కు మాత్రమే పరిమితమైన వార్త ఇదని, గుంటూరు లేదా చీరాల ప్రాంతానికి చెందిన ఓ నాయుడు కుటుంబం తో నాగబాబు వియ్యం అందబోతున్నారని తెలుస్తోంది. అయితే మరీ నలుగురికి తెలియకుండా నిశ్చితార్థం చేసుకుంటారా? అన్న డౌట్ ఎక్స్ ప్రెస్ చేస్తే, మంచి రోజుల లేవు అని ముందుగా నిశ్చితార్థం రెండు కుటుంబాల మధ్య చేసుకున్నారని సమాదానం వస్తోంది.
ఈ సంగతి ఎలా వున్నా, ఫేస్ బుక్ లో మాత్రం నీహాతో ఒక యువకుడి సెల్ఫీ కనిపించింది. దాని కింద కంగ్రాట్స్ మెసేజ్ లు కనిపిస్తున్నాయని మెగా ఫ్యాన్స్ ల్లో వినిపిస్తొంది. మరో రెండు రోజుల్లో వివరాలు చెబుతానని నీహారిక తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కొణిదెల వారింట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయన్నది పక్కా అని తెలుస్తోంది,