కోబ‌లి.. భారీ రీసెర్చ్

ప‌వ‌న్ క‌ల్యాణ్ – త్రివిక్రమ్‌ల హ్యాట్రిక్ మూవీ.. కోబ‌లి. 2016 చివర్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంద‌ని టాక్‌. అయితే ఈలోగా క‌థపై త్రివక్రమ్ అండ్ టీమ్ రీసెర్చ్ మొద‌లెట్టింద‌ట‌.  Advertisement రాయ‌ల‌సీమ జీవిన…

ప‌వ‌న్ క‌ల్యాణ్ – త్రివిక్రమ్‌ల హ్యాట్రిక్ మూవీ.. కోబ‌లి. 2016 చివర్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంద‌ని టాక్‌. అయితే ఈలోగా క‌థపై త్రివక్రమ్ అండ్ టీమ్ రీసెర్చ్ మొద‌లెట్టింద‌ట‌. 

రాయ‌ల‌సీమ జీవిన విధానం, వందేళ్ల క్రితం ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? మ‌ధ్యలో వ‌చ్చిన మార్పులేంటి? అనే విష‌యంపై కూలంకుశ శోధ‌న చేయ‌బోతోంద‌ట‌. కోబ‌లి రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో సాగే క‌థ‌. అక్కడి సంస్ర్కృతి సంప్రదాయాల్ని పూర్తిస్థాయిలో చూపించ‌బోతున్నార‌ట. 

అలా చేయాలంటే ముందు కొంత రిసెర్క్ చేయాల్సిందే. అందుకే ఇప్పుడు ఆ ప‌ని మొద‌లెట్టిన‌ట్టు తెలుస్తోంది.