కోబలి కథే అరవిందగా మారిందా?

కోబలి అన్నది త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో రావాల్సిన సినిమా. రాయలసీమ నేపథ్యంలో త్రివిక్రమ్ రాసుకున్న కథ. ఆయనకు చాలా అభిమానమైన కథ. కానీ పవన్ రాజకీయాల్లోకి వెళ్లిపోయాక ఆ ప్రాజెక్టు అలా…

కోబలి అన్నది త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో రావాల్సిన సినిమా. రాయలసీమ నేపథ్యంలో త్రివిక్రమ్ రాసుకున్న కథ. ఆయనకు చాలా అభిమానమైన కథ. కానీ పవన్ రాజకీయాల్లోకి వెళ్లిపోయాక ఆ ప్రాజెక్టు అలా వుండిపోయింది. అయితే ఆ కథే ఇప్పుడు అటు ఇటు మారి అరవింద సమేత వీరరాఘవగా వస్తోందని టాక్ వినిపిస్తోంది.

అరవింద సమేత వీరరాఘవ సినిమా సెన్సారు నిన్న పూర్తయింది. సెన్సారు అనంతరం సినిమా సంగతులు, కథ బయటకు రావడం అన్నది కామన్. అలా వచ్చిన కథ వింటూవుంటే, కోబలి సినిమానే అరవిందగా మారిందా? అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. 

కడప నేపథ్యంలో సాగే ఫ్యాక్షనిస్టు కథగా అరవింద సినిమా వుంటుందన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలో కడప కన్నా హైదరాబాద్ నే ఎక్కువ కనిపిస్తుందని తెలుస్తోంది. కోబలి కథ పూర్తి రాయలసీమ నేపథ్యంలో వుంటుందని గతంలో వార్తలు వచ్చాయి.

కానీ ఎన్టీఆర్ కోసం దాన్ని మార్చారని, ఆ విధంగా కోబలి.. అరవిందగా మారి వుంటుందని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.