అరవింద సమేత వీరరాఘవ సినిమా అడియో ఎప్పుడో బయటకు వచ్చింది. నాలుగే నాలుగు పాటలు. అయిదో పాట మీద జనాల గ్యాసిప్ లే తప్ప, అలాంటిది లేదని థమన్ ఎప్పుడో క్లారిటీ ఇచ్చాడు. అయితే సినిమాలో ఆర్ ఆర్ బిట్ లాంటి సాంగ్ బిట్ ఒకటి వుంటుందని, కొన్నాళ్ల క్రితమే గ్రేట్ ఆంధ్ర వెల్లడించింది. అది నేపథ్యంలో మ్యూజిక్ కు బదులుగా ఆర్ ఆర్ మాదిరిగా వస్తుందని అప్పట్లో వెల్లడించాం.
అయితే అది కూడా అడియో ఆల్బమ్ లోకి రాలేదు. పెట్టడమా? మానడమా? అన్న సందగ్ధంలో వుండిపోయారు దర్శకుడు త్రివిక్రమ్. ఆఖరికి జస్ట్ టూ డేస్ ముందు ఆయన మైండ్ ఫిక్సయింది. సినిమా చివరి క్వార్టర్ లో నేపథ్యసంగీతానికి బదులు, చిన్న ఆర్ ఆర్ సాంగ్ బిట్ వుంచాలని. అయితే అప్పటికప్పుడు జస్ట్ ఒకటి రెండు పదాలు,, ఒకటి రెండు లైన్లు అయినా ఎవరు రాస్తారు?
అంత టైమ్ లేదు.. దాంతో త్రివిక్రమ్ నే చేయిచేసుకుని, ఫినిష్ చేసారు. థమన్ తో చేయించి యాడ్ చేసారు. ఆ విధంగా మొత్తంమీద అరవిందలో ఆర్ ఆర్ బిట్ కు బదులు, ఆర్ ఆర్ బిట్ సాంగ్ అయిదో నెంబర్ గా వచ్చిచేరింది. ఈ సాంగ్ ఆర్ ఆర్ చేరడం వల్ల సీన్ మరింత బలంగా ఎలివేట్ అయిందని యూనిట్ భావిస్తున్నట్లు బోగట్టా.