అరవింద సమేత వీరరాఘవ. 2018 సెకండాఫ్ లో జనం వెయిట్ చేస్తున్న సినిమా. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా అంటూ ఎన్నేళ్ల బట్టో ఎదురుచూస్తున్న సినిమా. ఈ సినిమా ఎలా వుంటుంది? సినిమాలో ఏం వుంటుంది? అన్నది ఎన్టీఆర్ అభిమానులకు, త్రివిక్రమ్ అభిమానులకు కూడా అత్యంత ఆసక్తికరం. అందుకే జస్ట్ సినిమాలో పాత్రల సంక్షిప్త పరిచయం ఇది.
సినిమా కథను రివీల్ చేయడం కానీ, లీక్ చేయడం కానీ కాదు. సెన్సారు అనంతంర వినిపిస్తున్న సమాచారం ప్రకారం అరవిందలో క్యారెక్టర్లు ఇలా వుండే అవకాశం వుంది.
ఎన్టీఆర్-కడప కుర్రాడు.. ఫ్యాక్షనిస్టు గొడవల్లో ఇమడలేక హైదరాబాద్ వచ్చేస్తాడు.
సునీల్.. ఆటో గ్యారేజ్ యజమాని. హైదరాబాద్ లో ఎన్టీఆర్ కు ఆశ్రయం ఇస్తాడు.
సీనియర్ నరేష్.. హీరోయిన్ తండ్రి. లాయర్. తన దగ్గరకు వచ్చిన క్లయింట్ లు అందరినీ రకరకాలుగా వాడేసే ఫన్నీ క్యారెక్టర్.
పూజా హెగ్డే… నరేష్ కూతురు. ఈమెను దుండగుల నుంచి రక్షించడం ద్వారా హీరో పరిచయం అవుతాడు.
నవీన్ చంద్ర… ఫ్యాక్షనిస్టు జగపతిబాబు కొడుకు. హీరో చేతిలో తన్నులు తినే క్యారెక్టర్.
జగపతి బాబు.. కడపకు చెందిన అరివీర భయంకర ఫ్యాక్షనిస్టు.
వీరుకాక, పూజాహెగ్డే తమ్ముడు క్యారెక్టర్, రావు రమేష్ క్యారెక్టర్, జగపతి బాబు భార్య క్యారెక్టర్, హీరో ఇంట్లో బోలెడు మంది ఆడవాళ్ల క్యారెక్టర్లు వుంటాయి.