చాలా కాలం తరువాత కోన వెంకట్ పేరు మారుమోగుతోంది. ఆయన నిర్మాణ భాగస్వామిగా, మాటల రచయితగా అందించిన నిన్ను కోరి సినిమాకు మంచి ప్రశంసలే దక్కాయి. నిజానికి విడుదలకు ముందు ఈ సినిమాకు మరీ క్లాసిక్ లా వుంటుదేమో అన్న అనుమానాలు వినిపించాయి. కానీ సినిమాలో వీలు చిక్కినపుడల్లా ఫన్ బాగానే చూప్పించారు.
ఇండస్ట్రీలో శ్రీను వైట్ల ఫార్ములాగా చలామణీ అయిన కోన వెంకట్ అండ్ గోపీ మోహన్ ఫార్ములా ఒకటి వుంది. సినిమాలో కథ ఓ స్టేజ్ కు వచ్చేసరికి హీరో, హీరోయిన్, ప్రతి నాయకుడు, మిగిలిన నటులు ఓ ఇంట్లోనే చేరడం, కాస్త కన్ఫ్యూజన్ కామెడీ జరగడం అన్నది ఆ ఫార్ములా.
నిన్ను కోరి సినిమాలో కూడా కోన వెంకట్ తనకు అచ్చి వచ్చిన ఆ ఫార్ములాను లైట్ గా వాడినట్లే కనిపించింది. సెకెండ్ హీరో అన దగ్గ ఆది ఇంట్లోకి హీరో చేరడం, అప్పటికే ఆ ఇంట్లో హీరోయిన్ వుండడం, ఇంతలో హీరోయిన్ తండ్రి మురళీ శర్మ, బావ పృధ్వీ అక్కడికే చేరడం, దాదాపు సెకండాఫ్ లో ఎక్కువ ఆ ఇల్లు సెంటర్ పాయింట్ గా జరగడం విశేషం.
ఏమైనా కోన నమ్మకాన్ని ఆ సెంటిమెంట్ వమ్ము చేయలేదు.