Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కొందరినే పిలిచిన నాని

కొందరినే పిలిచిన నాని

నాని టాలీవుడ్ లో అందరి వాడుగా వుంటూ వస్తున్నాడు. ఏ గాడ్ ఫాదర్ లేకుండానే మెల్లగా ఎదిగి ఎదిగి ఇప్పుడు ఎనిమిది తొమ్మిది కోట్ల రెమ్యూనిరేషన్ స్టేజ్ కు చేరుకున్నాడు. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వుంది. దాంతో ఇప్పుడు విభిన్నమైన సినిమాలు అందించాలని నిర్మాతగా కూడా మారాడు. ఓ విభిన్నమైన సినిమా తీసారు. నష్టమైనా లాభమైనా ఇలాంటి సినిమాలు తీస్తూనే వుంటానని, ఇండస్ట్రీ తనకు ఇచ్చిన డబ్బులు ఇక్కడే ఖర్చుచేస్తానని చెప్పారు.

అంతే కాదు, మాంచి విభిన్నమైన సినిమా తీసాననే ఆనందంతో, ఇండస్ట్రీకి చెందిన కొందరిని ప్రత్యేకంగా పిలిచి నిన్నటికి నిన్న సినిమా చూపించారు. ఈ షోకి ఇండస్ట్రీకి చెందిన, తనతో పరిచయం, సాన్నిహిత్యం వున్నా కూడా కొందరినే పిలిచి కొందరిని పిలవకపోవడం చిత్రం. పిలిచిన వారంతా సూపర్ అంటే సూపర్ అని ట్విట్టర్ లో మోత మోగించారు.

శోభు యార్లగడ్డ అయితే హడావుడి రివ్యూలు కాకుండా, అలాంటి రివ్యూలతో సినిమాను 'ఫ..'  చేయకుండా, సరైన సమీక్షలు ఇవ్వాలని సూచించారు. ఇలా ఎందుకు అనుమానం వచ్చిందో ఆయనకే తెలియాలి.

నాని పిలిచిన వారి సంగతి అలా వుంచితే, పిలవడం మరిచిన వారు మాత్రం, మేధావి వర్గ జనాలను పిలవాలనుకున్నారేమో, తాము మేధావులం కాదని నాని అనుకున్నారేమో అని కామెంట్ చేస్తున్నారు. నాని ఫ్లాపుల్లో వున్నపుడు ఎక్కిన మెట్లను కూడ మరిచిపోయారని కామెంట్ లు కూడా వినిపిస్తున్నాయి. మరి ఎంత వరక నిజమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?