నాని తెలివైన నిర్మాత

ఇండస్ట్రీ ఇచ్చిన డబ్బులు ఇక్కడే ఖర్చుచేయడానికి రెడీ. నిర్మాతగా మంచి సినిమాలు చేయడం కోసం సంపాందించినవి ఖర్చుచేయడానికి రెడీ అంటూ చెబుతున్నాడు హీరో నాని. దాంతో మాంచి మార్కులు వచ్చాయి. అబ్బా.. నాని ఎంత…

ఇండస్ట్రీ ఇచ్చిన డబ్బులు ఇక్కడే ఖర్చుచేయడానికి రెడీ. నిర్మాతగా మంచి సినిమాలు చేయడం కోసం సంపాందించినవి ఖర్చుచేయడానికి రెడీ అంటూ చెబుతున్నాడు హీరో నాని. దాంతో మాంచి మార్కులు వచ్చాయి. అబ్బా.. నాని ఎంత రిస్క్ చేస్తున్నాడు అనేసుకోవచ్చు ఇండస్ట్రీ ఇన్ సైడ్ వినిపిస్తున్న వార్తలు. కానీ అసలు విషయం వేరు. అ.. సినిమా విషయంలో నాని చాలా తెలివిగానే వ్యవహరించాడు. అస్సలు రిస్క్ లేని ప్రాజెక్టు ఇది.

ఈ ప్రాజెక్టును డైరక్టర్, ఆర్ట్ డైరక్టర్ కలిసి కొత్తవాళ్లతో తీయాలని ప్రయత్నించారు. అప్పడు వాళ్లు వేసుకున్న బడ్జెట్ కోటి రూపాయిలు. కానీ తరువాత నాని దగ్గరకు వెళ్లింది. దాంతో నాని తన పరిచయాలు వాడి సినిమాకు గ్లామర్ యాడ్ చేసాడు. అలా చేసినా కూడా మరీ భారీగా కాస్టింగ్ ఖర్చు ఏమీ అయిపోలేదని. అంతా కలిపి కోటి రూపాయలలోపే అని ఇండస్ట్రీ వర్గాల అంచనా.

ఇక సినిమా కోసం ఓ కెఫెటేరియా సెట్ వేసారు. మాగ్జిమమ్ షూట్ అక్కడే జరిగింది. పబ్లిసిటీకి కూడా నాని ఎక్కువగా సోషల్ మీడియా మీదే ఆధారపడ్డారు. టొటల్ గా సినిమాకు మూడు నుంచి మహా అయితే నాలుగు కోట్ల రూపాయిలు ఖర్చయివుంటుందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. సినిమాను అమ్మకుండా డైరక్ట్ విడుదల చేస్తున్నారు. 

సినిమాకు డిజిటల్, శాటిలైట్ వంటివి నాని లాంటి హీరో సులువుగానే చేయించుకోగలరు. కనీసం అక్కడ రెండు మూడు కోట్లు వచ్చే అవకాశం వుంటుంది. అందువల్ల నానికి పెద్దగా రిస్క్ అయితే లేదు. సినిమా కనుక జనాలకు పడితే ఇంక కాసుల పంటే.