Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కొరటాల టైమ్ బాలేదా?

కొరటాల టైమ్ బాలేదా?

20-4-2018...మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్ లో భరత్ అనే నేను సినిమా విడుదలైన రోజు. ఇప్పటికి మూడేళ్లు దాటిపోయింది. టాలీవుడ్ టాప్ ఫైవ్ లో వున్న ఓ డైరక్టర్ సినిమా ఆనాటి నుంచి ఈనాటి వరకు రాకపోవడం అంటే ప్యూర్ బ్యాడ్ లక్ కాక మరేంటీ?  మెగాస్టార్ తో సినిమా అనుకున్న తరువాత వరుసగా ఏదో ఒక ఆటంకం. 

దాని వల్ల ఆలస్యం. రెండో హీరో క్యారెక్టర్ కోసం మహేష్ ను అనుకోవడం కాదు, తూచ్ అనుకుని రామ్ చరణ్ ను ఫిక్స్ చేసుకోవడం. కానీ అతగాడు ఆర్ఆర్ఆర్ దగ్గర అనుమతి తీసుకుని రావడానికి ఆలస్యం కావడం. రెండో విడతల కరోనా వ్యవహారాలు. అన్నీ కలిసి ఆచార్య సినిమాను అలా వెనక్కు వెనక్కు నెడుతూనే వస్తున్నాయి.

ఈలొగా ఆచార్య తరువాత సినిమా కోసం ప్రయత్నాలు. బన్నీ హీరో అనుకున్నారు. కానీ బన్నీ ఇప్పట్లో వచ్చేలా లేడు అని, పుష్ప రెండు భాగాలు అని తెలిసి ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లారు. ఇప్పుడు ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ ప్లస్ కరోనా సెకెండ్ వేవ్. దాంతో ఆర్ఆర్ఆర్ మరింత ఆలస్యం.

అందువల్ల ఎన్టీఆర్ కొత్త సినిమాకు రావడం అంటే కాస్త ఆలస్యం తప్పదు. ఈలోగా ఆచార్య పూర్తి చేయాల్సి వుంది. అన్నీ అనుకూలిస్తే ఆగస్టు నాటికి ఆచార్య పూర్తి కావాల్సి వుంది. ఆ తరువాత ఎన్టీఆర్ సినిమా ప్రారంభించినా, అది ఆర్ఆర్ఆర్ తరువాతే విడుదల కావాల్సి వుంటుంది. 

అంటే వినిపిస్తున్న వదంతులు నిజమైతే 2022 సమ్మర్ తరువాతే. ఇదంతా చూస్తుంటే ఎక్కడో లక్ వెనక్కు లాగుతున్నట్లుంది కొరటాల ను.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?