Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కొరటాల పాయింట్ కు ఎన్టీఆర్ అబ్జెక్షన్?

కొరటాల పాయింట్ కు ఎన్టీఆర్ అబ్జెక్షన్?

ఏస్ డైరక్టర్ కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా కథ చర్చలు షురూ అయినట్లు బోగట్టా. 

స్టూడెంట్ లీడర్ గా వుంటూ ఎదిగి ఒక పెద్ద కంపెనీకి  సీఈఓ గా మారిన వ్యక్తి, దేశ పటంలోంచి ఏకంగా ఓ గ్రామం మాయం కావడం అనే సమస్యను టేకప్ చేయడం లాంటి పాయింట్ ఏదో శివ చెప్పినట్లు తెలుస్తోంది. 

పాయింట్, లైన్, స్టోరీ ఇంట్రస్టింగ్ గానే వున్నా, ఇప్పటికే ఇలాంటి లైన్ తో పలు సినిమాలు వచ్చాయని ఎన్టీఆర్ అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది.

కీ పాయింట్ వుంచి మిగిలిన పాయింట్లు మార్చడమో, లేదా స్టూడెంట్ లీడర్ తరువాత వచ్చే పాయింట్లు మార్చడమో అనే విషయాల దగ్గర డిస్కషన్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

ఇఫ్పటికే ఈ పాయింట్ విన్నవారు మహర్షి 2 లేదా శ్రీమంతుడు అంటూ కామెంట్ చేస్తున్నారు.  అందువల్ల ఎన్టీఆర్ ఇన్ పుట్స్ కి అనుగుణంగా కథను తయారుచేసే పనిలో కొరటాల వున్నారని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?