అప్పన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు

ఉత్తరాంధ్రాలో సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిది. ఈ ఆలయానికి వెయేళ్ల చరిత్ర ఉంది. యునెస్కో గుర్తింపు కోసం ఒక వైపు ప్రయత్నాలు గట్టిగా సాగుతున్నాయి. Advertisement ఈ నేపధ్యంలో…

ఉత్తరాంధ్రాలో సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిది. ఈ ఆలయానికి వెయేళ్ల చరిత్ర ఉంది. యునెస్కో గుర్తింపు కోసం ఒక వైపు ప్రయత్నాలు గట్టిగా సాగుతున్నాయి.

ఈ నేపధ్యంలో అనూహ్యంగా మరో అరుదైన గౌరవం ఈ ఆలయానికి దక్కింది. ఆలయానికి ఐఎస్ఓ గుర్తింపు లభించింది. ఆలయంలో కల్పిస్తున్న సౌకర్యాలతో పాటు, పచ్చదనం, పరిశుభ్రతను మెచ్చి ఐఎస్ఓ గుర్తింపును ఇచ్చారు. ఈ విషయాన్ని వివరిస్తూ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆనందం వ్యక్తం చేశారు.

సింహాచలం ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి ప్రకటించారు. ఆలయానికి కేంద్రం మంజూరు చేసిన ప్రసాదం పధకం నిధులను వెచ్చించి అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకునేలా చూస్తామని తెలిపారు. కాగా త్వరలో యునెస్కో గుర్తింపు కూడా ఆలయానికి దక్కాలని అధికారులు కూడా గట్టిగా  కోరుకుంటున్నారు. 

కర్నాటక ఆంధ్రాలను కలిపి పాలించిన విజయనగరం సామ్రాజ్య అధిపతి శ్రీక్రిష్ణదేవరాయలు విశేషంగా ఆరాధించి అప్పన్న స్వామికి ఎన్నో కానుకలు సమర్పించారు. ఆ శాసనాలతో పాటు 11వ శతాబ్దం కాలం నాటి శిల్ప సౌందర్యం కూడా ఈ ఆలయం సొంతం.