‘కోటీశ్వరుడి’ పారితోషికం 15లక్షలు

మీలో ఎవరు కోటీశ్వరుడు..రెండు సీజన్లలో ప్రసారమై ప్రేక్షకుల అభిమానం చూరగొన్న షో. హీరో నాగార్జున ఇమేజ్ కు కొత్త సొగసులు జోడించింది. ఇప్పుడు మళ్లీ ఈ షోకి గ్యాప్ వచ్చింది. ఆరునెలల తరువాత ఇది…

మీలో ఎవరు కోటీశ్వరుడు..రెండు సీజన్లలో ప్రసారమై ప్రేక్షకుల అభిమానం చూరగొన్న షో. హీరో నాగార్జున ఇమేజ్ కు కొత్త సొగసులు జోడించింది. ఇప్పుడు మళ్లీ ఈ షోకి గ్యాప్ వచ్చింది. ఆరునెలల తరువాత ఇది వుంటుదా..వుండదా తెలుస్తుంది. 

ఎందుకంటే మా టీవీని స్టార్ యాజమాన్యం తీసుకుంది కాబట్టి. అది అలా వుంచితే, అసలు కోటీశ్వరుడి ఖర్చెంత అన్నది ఆరా తీస్తే…ఇలాంటి షో ఇంకెవరు చేసినా 15లక్షలకు మించి ఖర్చు కాదంట..ఎపిసోడ్ కు. కానీ నాగ్ ప్రెస్టీజియస్ గా ఫీలై చేయడంతో ఒక్కో ఎపిసోడ్ కు ముఫై అయిదు లక్షల వరకు ఖర్చు చేసారట. 

ఇంతకీ నాగ్ రెమ్యూనిరేషన్ ఎంత అంటే..ఎపిసోడ్ కు 15లక్షల వరకు అని వినికిడి. ఆ లెక్కన సినిమాల కన్నా ఇదే బాగా కిట్టుబాటు. పైగా మాంచి డిఫరెంట్ ఇమేజ్ కూడా.