కొత్త డైరక్టర్లంటే బ్రహ్మీకి చిన్నచూపా?

కొత్తయినా, పాతయినా డెరక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్. అతన్ని గౌరవించాల్సిందే. అతను చెప్పినట్లు నటులు చేయాల్సిందే. కావాలంటే ఇంప్రూవైజ్ చేయచ్చు..సలహాలు ఇవ్వచ్చు. కానీ స్టార్ కమెడియన్ బ్రహ్మీకి మాత్రం కొత్తగా మెగా…

కొత్తయినా, పాతయినా డెరక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్. అతన్ని గౌరవించాల్సిందే. అతను చెప్పినట్లు నటులు చేయాల్సిందే. కావాలంటే ఇంప్రూవైజ్ చేయచ్చు..సలహాలు ఇవ్వచ్చు. కానీ స్టార్ కమెడియన్ బ్రహ్మీకి మాత్రం కొత్తగా మెగా ఫోన్ పట్టుకున్న డైరక్టర్లంటే కాస్త చిన్న చూపు అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయట. వాళ్ల సినిమాల్లో తన చిత్తానికి నటిస్తాడు కానీ, డైరక్టర్ చెప్పిన మేరకు అంటూ వదంతులు వినవస్తున్నాయి. 

సీన్ చెపితే, దీనికి ఇంత అక్కర లేదు..ఈ మాత్రం చాలు అంటాడట…సీన్ ను ఆయనే ఎడిట్ చేసేస్తారట..జస్ట్ కాజువల్ వాక్ లేదా వాకవే సీన్ తీయాలంటే, షూట్ చివర్న వెళ్లిపోయేటపుడు తీసేసుకో, మళ్లీ దానికి ప్రత్యేకంగా ఏక్ట్ చేయడం ఎందుకు అంటారని టాక్ వినిపిస్తోంది. మరి నిజమో కాదో అనుభవించిన చిన్న, కొత్త డైరక్టర్లకే తెలియాలి.

ఇధిలా వుంటే 60 ఏళ్ల వయసులో మరింక కొత్తగా చేయాలని కానీ, చేద్దామని కానీ బ్రహ్మీ ఇక అనుకోవడం లేదని, అందువల్లే ఆయన కామెడీ మొహం మొత్తుతోందని విమర్శలు వినవస్తున్నాయి. దీంతో ఇప్పుడు పృధ్వీ మాంచి ఆల్టర్ నేటివ్ గా మారాడు. బ్రహ్మీ క్యారెక్టర్లనీ ఇప్పుడు పృధ్వీకి వెళ్తున్నాయి. పైగా షకలక శంకర్, సప్తగిరి లాంటి కమెడియన్లు కూడా మంచి ఆదరణ అందుకుంటున్నారు. 

పైగా బ్రహ్మీకి రోజుకు నాలుగు నుంచి అయిదు లక్షలు ఇవ్వాలి. ఈ డబ్బులతో కొత్త కమెడియన్లు బ్యాచ్ బ్యాచ్ వస్తారు..రోజుకు..ఈ కారణాలతోనే బ్రహ్మీకి చాలా వరకు అవకాశాలు తగ్గిపోయాయని తెలుస్తోంది.